News June 4, 2024
ప్రకాశంలో 11 స్థానాల్లో టీడీపీ ఆధిక్యం

AP: ప్రకాశం జిల్లాలోని మొత్తం 12 స్థానాలకుగానూ 11 సీట్లలో టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అద్దంకి (TDP) 7318, చీరాల (TDP) 6440, దర్శి (TDP) 305, గిద్దలూరు(TDP) 447, కందుకూరు (TDP) 2729, కనిగిరి (TDP) 992, కొండపి (TDP) 3078, మార్కాపురం (TDP) 4559, ఒంగోలు (TDP) 4022, పర్చూరు (TDP) 2753, సంతనూతలపాడు (TDP) 17540, యర్రగొండపాలెంలో (YCP) 441 ఓట్ల లీడింగ్‌లో ఉన్నాయి.
Similar News
News September 10, 2025
అమ్మాయిలకి ఈ టెస్టులు చేయించండి..

ఆడపిల్లలున్న తల్లిదండ్రులు వారు రజస్వల అయినప్పటి నుంచి వారికి కొన్ని ఆరోగ్య పరీక్షలు కచ్చితంగా చేయించాలంటున్నారు నిపుణులు. రక్తహీనత సమస్యను గుర్తించడానికి కంప్లీట్ బ్లడ్ కౌంట్(సీబీసీ) పరీక్ష, హార్మోన్ల అసమతుల్యతను గుర్తించడానికి థైరాయిడ్, హార్మోన్ల పరీక్షలు, విటమిన్‌ప్రొఫైల్ టెస్ట్, ఏవైనా మూత్ర సంబంధిత సమస్యలుంటే మూత్ర పరీక్ష చేయించాలి. వీటివల్ల ఏవైనా సమస్యలుంటే ముందుగానే గుర్తించే వీలుంటుంది.
News September 10, 2025
యువత ప్రాణాలు తీస్తున్న బ్రేకప్స్

దేశంలో బ్రేకప్‌ల వల్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని సూసైడ్ ప్రివెంటివ్ హెల్ప్‌లైన్ సంస్థ ‘వన్ లైఫ్’ తెలిపింది. అప్పులు, వైవాహిక సమస్యలు, నిరుద్యోగం, బెట్టింగ్, ఒత్తిడి, ఆర్థిక మోసాలతో మరికొందరు సూసైడ్ చేసుకుంటున్నట్లు వివరించింది. తమ సంస్థకు ఏటా సగటున 23,000 కాల్స్ వస్తున్నాయంది. ఫోన్ చేసిన వారిపై సానుభూతి చూపిస్తూ కౌన్సిలర్లు వారిలో ధైర్యం నింపుతారని వివరించింది.
* ఇవాళ ఆత్మహత్యల నివారణ దినోత్సవం
News September 10, 2025
ఇద్దరు ISIS అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్

ఇద్దరు ISIS అనుమానిత ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఇస్లాంనగర్‌లో అజార్ డానిష్, ఢిల్లీలో అఫ్తాబ్‌ను అదుపులోకి తీసుకుంది. వారి నుంచి ఆయుధాలు, బుల్లెట్లు, ఎలక్ట్రానిక్ డివైజెస్ స్వాధీనం చేసుకుంది. వీరిద్దరూ ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. సెంట్రల్ ఏజెన్సీస్, ఝార్ఖండ్ ఏటీఎస్‌తో కలిసి రైడ్స్ చేసి వారిని పట్టుకుంది.