News June 4, 2024
ఎస్టీ నియోజకవర్గాల్లోనూ వైసీపీ డీలా

AP: ఎస్టీ నియోజకవర్గాల్లో ఈసారి వైసీపీ చతికిలపడింది. రాష్ట్రంలో ఏడు ఎస్టీ రిజర్వుడు(పాలకొండ, కురుపాం, సాలూరు, అరకువ్యాలీ, పాడేరు, రంపచోడవరం, పోలవరం) నియోజకవర్గాలున్నాయి. వీటిలో ప్రస్తుతం పాలకొండ, అరకు, పాడేరులో వైసీపీ అభ్యర్థులు లీడింగ్‌లో ఉన్నారు. మిగతా చోట్ల కూటమి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. కాగా గత ఎన్నికల్లో ఈ ఏడు స్థానాలను వైసీపీ గెలుచుకుంది.
Similar News
News September 10, 2025
SDPT: స్థానిక ఎన్నికలు.. ఆశావాహుల్లో ఖర్చుల బుగులు

స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో పోటీ చేసే ఆశావాహుల్లో ఖర్చుల బుగులు పట్టుకుంది. కొన్ని గ్రామాల్లో ఆశావాహులు స్థానికులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. కొందరు ఎన్నికల తేదీ రాకముందే ఇప్పటినుండే ఖర్చు చేస్తే ఎలా అని సందిగ్ధంలో పడ్డారు. బీసీ రిజర్వేషన్లు తేలాకే స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం ముగ్గు చూపడంతో ఎన్నికల ఆలస్యం ఆశావాహులను కలవరపెట్టింది.
News September 10, 2025
అమ్మాయిలకి ఈ టెస్టులు చేయించండి..

ఆడపిల్లలున్న తల్లిదండ్రులు వారు రజస్వల అయినప్పటి నుంచి వారికి కొన్ని ఆరోగ్య పరీక్షలు కచ్చితంగా చేయించాలంటున్నారు నిపుణులు. రక్తహీనత సమస్యను గుర్తించడానికి కంప్లీట్ బ్లడ్ కౌంట్(సీబీసీ) పరీక్ష, హార్మోన్ల అసమతుల్యతను గుర్తించడానికి థైరాయిడ్, హార్మోన్ల పరీక్షలు, విటమిన్‌ప్రొఫైల్ టెస్ట్, ఏవైనా మూత్ర సంబంధిత సమస్యలుంటే మూత్ర పరీక్ష చేయించాలి. వీటివల్ల ఏవైనా సమస్యలుంటే ముందుగానే గుర్తించే వీలుంటుంది.
News September 10, 2025
యువత ప్రాణాలు తీస్తున్న బ్రేకప్స్

దేశంలో బ్రేకప్‌ల వల్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని సూసైడ్ ప్రివెంటివ్ హెల్ప్‌లైన్ సంస్థ ‘వన్ లైఫ్’ తెలిపింది. అప్పులు, వైవాహిక సమస్యలు, నిరుద్యోగం, బెట్టింగ్, ఒత్తిడి, ఆర్థిక మోసాలతో మరికొందరు సూసైడ్ చేసుకుంటున్నట్లు వివరించింది. తమ సంస్థకు ఏటా సగటున 23,000 కాల్స్ వస్తున్నాయంది. ఫోన్ చేసిన వారిపై సానుభూతి చూపిస్తూ కౌన్సిలర్లు వారిలో ధైర్యం నింపుతారని వివరించింది.
* ఇవాళ ఆత్మహత్యల నివారణ దినోత్సవం