News June 4, 2024
BIG BREAKING: ఏపీలో బీజేపీ తొలి విజయం
ఏపీలో బీజేపీ బోణీ కొట్టింది. అనపర్తిలో బీజేపీ MLA అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. టీడీపీ నేతగా ఉన్న నల్లమిల్లికి ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన కాషాయ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఏపీలో ప్రస్తుతం బీజేపీ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Similar News
News January 23, 2025
కుక్కర్‌లో బాడీ పార్ట్‌లు.. ట్విస్ట్?
భార్యను చంపి బాడీ పార్ట్‌లను <<15227723>>కుక్కర్‌లో ఉడికించిన కేసులో<<>> ట్విస్ట్ చోటు చేసుకుంది. ఓ మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే గురుమూర్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా ఆయన మొబైల్‌లో ఓ మహిళ ఫొటోలు గుర్తించినట్లు సమాచారం. ఇదే విషయమై వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసుల నుంచి ఈ కేసు విషయమై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
News January 23, 2025
VIRAL: సిగరెట్ మానేసేందుకు వింత నిర్ణయం
తుర్కియేకు చెందిన ఇబ్రహీం యూసీల్ అనే వ్యక్తి సిగరెట్ తాగడం మానేసేందుకు వింత నిర్ణయం తీసుకున్నారు. తలకు బంతి లాంటి హెల్మెట్ ధరించి, దానికి తాళం వేసి భార్య చేతికి తాళం చెవి ఇస్తున్నారు. 2013 నుంచి ఆయన ఇలాగే హెల్మెట్‌తో దర్శనమిస్తున్నారు. గతంలో ఇబ్రహీం రోజుకు రెండు పెట్టెల సిగరెట్లు తాగేవారు. పిల్లల బర్త్‌డే రోజు మానేయడం, మళ్లీ తాగడం చేస్తుండేవారు. దీంతో ఈ హెల్మెట్ ఆలోచన చేశారు.
News January 23, 2025
టెన్త్ విద్యార్థులకు అలర్ట్
TG: పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. మార్చి 6 నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. రోజూ మ.1.15 గం. నుంచి సా.4.15 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి.
*మార్చి 6- ఫస్ట్ లాంగ్వేజ్ *7- సెకండ్ లాంగ్వేజ్ *10- థర్డ్ లాంగ్వేజ్ *11- మ్యాథ్స్ *12- ఫిజికల్ సైన్స్ *13- బయోలాజికల్ సైన్స్ *15- సోషల్ స్టడీస్
>>ఇక టెన్త్ వార్షిక పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్నారు.