News June 4, 2024
ప.గో.: 50 వేల మెజారిటీ దిశగా RRR

ఉండి నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 18 రౌండ్లలో లెక్కింపు జరగనుండగా.. ఇప్పటి వరకు 12 రౌండ్లు పూర్తయ్యాయి. కాగా కూటమి MLA అభ్యర్థి రఘురామకృష్ణరాజు 81931 ఓట్లు సాధించి 39390 ఓట్ల మెజారిటీతో దూసుకెళ్తున్నారు. అయితే వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజుకు 42541 ఓట్లు వచ్చాయి.
Similar News
News September 13, 2025
మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత: ప.గో కలెక్టర్

జిల్లాలో మహిళల ఆరోగ్య పరిరక్షణకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం భీమవారంలోని కలెక్టరేట్‌లో మాట్లాడారు. ‘స్వస్థ నారి – శసక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు, వైద్య నిపుణుల సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.
News September 13, 2025
పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు

జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణపై రూపొందించిన అవగాహన పోస్టర్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా ఉచిత టీకాలు వేస్తారని ఆమె తెలిపారు. జిల్లాలోని పశువుల యజమానులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News September 13, 2025
తాగునీటి చెరువులో పడి మూడేళ్ల చిన్నారి మృతి

అత్తిలి మండలం రామన్నపేటలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. అంగన్వాడీ పాఠశాలలో చదువుతున్న సప్పా మోహిత (3) అనే చిన్నారి మధ్యాహ్నం భోజనం చేసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు దగ్గరలో ఉన్న మంచినీటి చెరువులో పడి మృతి చెందింది. ఘటన సమయంలో అంగన్వాడీ కేంద్రంలో టీచర్, ఆయమ్మ లేకపోవడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తాపీ పని చేసుకునే మోహిత తండ్రి శివ కుటుంబాన్ని ఈ ఘటన తీవ్ర విషాదంలో ముంచింది.