News June 4, 2024
BJP 400 పార్ పాచికలు పారలేదు
ఈసారి 400 స్థానాల్లో గెలుస్తామన్న BJP అంచనాలు తలక్రిందులయ్యాయి. 2014, 19లో సొంతంగా మ్యాజిక్ ఫిగర్ 273 సాధించిన కమలం పార్టీ ఇప్పుడు ఈ నంబర్‌ను చేరేందుకు ఇబ్బంది పడుతోంది. దీంతో మిత్రపక్షాల మద్దతుతోనే మోదీ పీఎం కావాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు NDA-INDIA మధ్య సీట్ల తేడా 100 లోపే ఉంది. దీంతో రామమందిరం, GDP, విశ్వగురు, విజన్ 2047 వంటి అంశాలు ప్రజలను అనుకున్నంతగా ఆకట్టుకోలేదని అర్థమవుతోంది.
Similar News
News January 23, 2025
ముగిసిన సీఎం రేవంత్ దావోస్ పర్యటన
TG: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో పలు సంస్థలతో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో సుమారు 49,550 వేల ఉద్యోగాల కల్పనకు అవకాశముంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల్లో ఇదే రికార్డు కాగా గత ఏడాదితో పోలిస్తే నాలుగు రెట్లు మించాయి. కాగా రేపు ఉదయం సీఎం రేవంత్ బృందం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనుంది.
News January 23, 2025
కేంద్ర మంత్రులతో భేటీ కానున్న చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని ఇవాళ రాత్రికి ఢిల్లీకి చేరుకుంటారు. రేపు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి తదితరులను కలుస్తారు. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమవుతారు. సాయంత్రానికి తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు.
News January 23, 2025
రికార్డు సృష్టించిన చైనా కృత్రిమ సూర్యుడు
చైనా కృత్రిమ సూర్యుడు.. ఎక్స్‌పరిమెంటల్ అడ్వాన్స్‌డ్ సూపర్ కండక్టింగ్ టొకమాక్ (ఈస్ట్) ఫ్యూజన్ ఎనర్జీ రియాక్టర్ సరికొత్త రికార్డు సృష్టించింది. 1,000 సెకన్ల(16 నిమిషాలు)పాటు 100 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతను విడుదల చేసింది. ఈ ప్రాజెక్టును 2006 నుంచి చేపడుతున్నారు. ఇందులో భారత్‌తోపాటు అమెరికా, రష్యా, జపాన్, సౌత్ కొరియా దేశాలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి.