News June 4, 2024

91 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో వేమిరెడ్డి

image

AP: నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 91 వేలకుపైగా ఓట్ల లీడింగ్‌లో ఆయన కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి వెనుకంజలో ఉన్నారు. అలాగే ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి 10,115 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Similar News

News July 5, 2025

ప్రజలకు మీరు చేసే సత్కారం ఇదేనా?: KTR

image

TG: సీఎం రేవంత్ రెడ్డి <<16942338>>వ్యాఖ్యలపై<<>> బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ‘మీ PayCM అందరినీ బట్టలిప్పి కొడితే తప్ప ఇందిరా గాంధీ గొప్పతనం అర్థం కాదంటున్నాడు. ప్రజలకు మీరు చేసే సత్కారం ఇదేనా రాహుల్ గాంధీ? తెలంగాణను ఏఐసీసీకి ఏటీఏంగా మార్చినప్పటి నుంచి ఆయన ఏది పడితే అది మాట్లాడటాన్ని అనుమతిస్తున్న మీ విధానాన్ని జనం గమనిస్తూనే ఉన్నారు’ అని ట్వీట్ చేశారు.

News July 5, 2025

10,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని EU డిమాండ్

image

APSRTCలో ఖాళీగా ఉన్న 10,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఎంప్లాయిస్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తమకు వెంటనే 11వ PRC బకాయిలు, పెండింగ్ DAలు చెల్లించాలని కోరింది. మరణించిన, రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌లు తక్షణం చెల్లించాలని నిన్న విజయవాడలో నిర్వహించిన ధర్నాలో కోరింది. అటు కొత్తగా కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను RTCకే అప్పగించాలని EU స్పష్టం చేసింది.

News July 5, 2025

WOW.. అంతరిక్షం నుంచి మెరుపు ఎలా ఉందో చూడండి

image

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన మెరుపు ఫొటో నెటిజన్లను మైమరిపిస్తోంది. దీనిని స్ప్రైట్ అని పిలుస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇది సాధారణ మెరుపులా కాకుండా జెల్లీ ఫిష్ ఆకారపు పేలుళ్లు లేదా స్తంభంలా కనిపిస్తుందని పేర్కొన్నారు. ‘జస్ట్ వావ్. మేము ఈ ఉదయం మెక్సికో & యూఎస్ మీదుగా వెళ్లినప్పుడు, నేను ఈ స్ప్రైట్‌ను బంధించా’ అని వ్యోమగామి నికోల్ SMలో ఈ చిత్రాన్ని పంచుకోగా వైరలవుతోంది.