News June 4, 2024

పురందీశ్వరికి 2 లక్షలు దాటిన మెజార్టీ

image

AP: ఎన్నికల్లో కూటమి రాజమండ్రి బీజేపీ అభ్యర్థి పురందీశ్వరికి ఇప్పటికే 2 లక్షల మెజార్టీ దాటింది. ప్రస్తుతం ఆమె 2,05,531 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక శ్రీకాకుళం, విశాఖ, అమలాపురం, విజయవాడ, గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థులు లక్ష పైన మెజార్టీలతో కొనసాగుతున్నారు.

Similar News

News September 11, 2025

3 బాణాలతో కురుక్షేత్రాన్ని ముగించగలడు!

image

భీముని మనవడు, ఘటోత్కచుని కుమారుడు ‘బార్బరీకుడు’. ఈయన మహాభారత సంగ్రామంలో పాల్గొందామని అనుకుంటాడు. కేవలం 3 బాణాలతోనే యుద్ధాన్ని ముగించగల ప్రతిభ ఆయన సొంతం. కానీ, శ్రీకృష్ణుడు బార్బరీకుణ్ని అడ్డుకుంటాడు. ఆయన రణరంగంలో దిగితే యుద్ధం ఏకపక్షం అవుతుందని గ్రహిస్తాడు. యుద్ధంలో ఎవరూ మిగలరని భావించి శ్రీకృష్ణుడు ఆయన తలను దానంగా అడుగుతాడు. అనంతరం కలియుగంలో ‘శ్యామ్ బాబా’గా పూజలందుకుంటావని వరం ఇస్తాడు.

News September 11, 2025

అభినవ షిరిడీగా పేరొందిన మహిమాన్విత క్షేత్రం

image

నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరులో ఉన్న శ్రీ దత్త వెంకట సాయి ఆలయం, భక్తులకు కొంగుబంగారం. అభినవ షిరిడీగా పేరుపొందిన ఈ క్షేత్రం దత్తాత్రేయ, వెంకటేశ్వర, శివ, శనేశ్వర స్వామి ఆలయాలతో అలరారుతోంది. ఇక్కడ ప్రతి గురువారం అన్నదానం ఉంటుంది. ప్రతిరోజు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో కొలువైన సాయినాథుడు భక్తుల కోర్కెలను తీరుస్తాడని, ఎంతో మహిమ గలవాడని భక్తుల నమ్మకం.

News September 11, 2025

ఇంటి గడపను పవిత్రంగా ఎందుకు పరిగణిస్తారు?

image

మన గృహానికి ఉండే ద్వారానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. ద్వారం పైభాగంలో ఉన్న కమ్మిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకే దానికి మామిడి తోరణం కడతారు. ద్వారం దిగువన ఉన్న గడప కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అందుకే దానికి పసుపు రాస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. గడపకు పసుపు పూయడం వల్ల క్రిమికీటకాలు ఇంట్లోకి రాకుండా ఉంటాయన్నది మరో కారణం.