News June 4, 2024
12వ రౌండ్: 1,38,616 బండి సంజయ్ ఆధిక్యం
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ప్రతి రౌండ్‌లో ఆధిక్యతను కనబరుస్తూ దూసుకుపోతున్నారు. 12వ రౌండ్ ముగిసేసరికి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై 1,38,616 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బిజెపికి 3,31,529 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు 1,92,913 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్‌కు 1,57,061 ఓట్లు వచ్చాయి.
Similar News
News January 3, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ కథలాపూర్ మండలంలో యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరి అరెస్ట్. @ గంభీరావుపేట మండలంలో ఉరివేసుకొని పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య. @ శంకరపట్నం మండలంలో లారీ, పాల వ్యాను డీ.. డ్రైవర్ కు గాయాలు. @ జగిత్యాలలో కొనసాగుతున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరసన. @ జగ్గాసాగర్, మేడిపల్లి గ్రామాలలో సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని వినతి. @ కాలేశ్వరంలో భక్తుల సందడి.
News January 2, 2025
ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం
చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రైవేట్ గార్డెన్స్‌లో మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News January 2, 2025
ఎల్లారెడ్డిపేట: యువకుడిపై ఎలుగుబంటి దాడి
ఓ యువకుడిపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన దాడి చేసి గాయపరిచిన ఘటన బుధవారం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుట్టపల్లి చెరువు తండాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. భూక్య నరేశ్ మేకలు కాయడానికి అడవికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడే ఓ చెట్ల పొదల్లో దాగి ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా నరేశ్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో అతడి చేతికి గాయం అయింది. స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.