News June 4, 2024
సేఫ్ జోన్‌లో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు..!
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేవలం పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులే గెలుపు దిశగా పయనిస్తున్నారు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 6,764, తంబళ్లపల్లెలో ఆయన సోదరుడు ద్వారకనాథ రెడ్డి 6,363 ఓట్ల లీడ్‌తో ఉన్నారు. మరోవైపు పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ స్థానంలో 36,207 ఓట్లతో ముందంజలో ఉన్నారు. పుంగనూరులో 4, తంబళ్లపల్లెలో 10 రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉంది.
Similar News
News December 29, 2024
చిత్తూరు కలెక్టరేట్‌లో రేపు గ్రివెన్స్ డే: కలెక్టర్
చిత్తూరు కలెక్టరేట్‌లో రేపు (సోమవారం) ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉ.9.30 నుంచి మధ్యాహ్నం1 వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
News December 29, 2024
తిరుపతి: పరీక్షలు వాయిదా
తిరుపతి SV యునివర్సిటీ పరిధిలో జరుగుతున్న PG మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడినట్లు పరీక్షల నియంత్రణ అధికారి దామ్లా నాయక్ తెలిపారు. ఈ నెల 30 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా.. విద్యార్థుల అభ్యర్థన మేరకు జనవరి 3వ తేదీకి మార్చినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని దామ్లా నాయక్ సూచించారు.
News December 29, 2024
కుప్పంలో ఫారెస్ట్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
కుప్పం నియోజకవర్గంలో శనివారం రాత్రి ఫారెస్ట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా కలపను అక్రమంగా తరలిస్తున్న పది వాహనాలను ఫారెస్ట్ అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. కుప్పం నియోజకవర్గంలో ఇటీవల కలప అక్రమ రవాణా జోరుగా సాగుతున్న నేపథ్యంలో శనివారం రాత్రి ఫారెస్ట్ అధికారులు నియోజకవర్గ వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.