News June 4, 2024
జగన్‌కు భారీగా తగ్గనున్న మెజార్టీ?
AP: ఈ ఎన్నికల్లో పులివెందులలో జగన్‌కు భారీగా మెజారిటీ తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 10 రౌండ్లు పూర్తి కాగా 37 వేలకుపైగా మెజారిటీతో ఆయన కొనసాగుతున్నారు. మొత్తం 22 రౌండ్లు పూర్తయ్యేసరికి దాదాపు 60 వేల నుంచి 70 వేల మెజారిటీ రావొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా గత ఎన్నికల్లో జగన్‌కు 90 వేలకుపైగా మెజారిటీ వచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News January 3, 2025
వచ్చేవారం భారత్‌కు జేక్ సలివాన్
US జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ వచ్చేవారం భారత్‌కు రానున్నారు. ఇరు దేశాలు సంయుక్తంగా ప్రారంభించిన క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్(iCET) ప్రగతిని ఆయన పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. AI, సెమీ కండక్టర్స్, బయోటెక్నాలజీ, రక్షణ ఆవిష్కరణల రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఐసెట్‌ను భారత్, అమెరికా ప్రారంభించాయి. కాగా.. భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సలివాన్ కీలక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.
News January 3, 2025
రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చకపోతే ఉద్యమమే: ఎంపీ లక్ష్మణ్
TG: రాష్ట్రప్రభుత్వం రింగ్ రోడ్డు(RRR) ఉత్తర అలైన్‌మెంట్‌ను మార్చాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. లేదంటే బాధితుల తరఫున భారీ ఉద్యమాన్ని మొదలుపెడతామని హెచ్చరించారు. ‘బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కాంగ్రెస్ కూడా అలైన్‌మెంట్ మార్చాలనే డిమాండ్ చేసింది. ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ వచ్చి భువనగిరిలో బాధితులకు హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారం రాగానే పట్టించుకోవడం మానేశారు’ అని విమర్శించారు.
News January 3, 2025
శ్రీవారికి గత ఏడాది రూ.1365 కోట్ల ఆదాయం
తిరుమలేశుడికి గత ఏడాది హుండీ ద్వారా సమకూరిన ఆదాయం వివరాలను టీటీడీ తాజాగా వెల్లడించింది. స్వామివారికి 2024లో రూ.1365 కోట్లు వచ్చాయని పేర్కొంది. మొత్తంగా 2.55 కోట్లమంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారని, వారిలో 99లక్షలమంది తలనీలాలు సమర్పించారని తెలిపింది. 12.44 కోట్ల లడ్డూల్ని విక్రయించామని స్పష్టం చేసింది.