News June 4, 2024
5.18లక్షల ఓట్ల ఆధిక్యంలో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి
నల్గొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి రికార్డు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంకా చివరి దశ ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా… ప్రస్తుతం 5.18లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తెలంగాణలో అత్యధిక మెజార్టీ సాధించే అభ్యర్థిగా రఘువీర్ రెడ్డి రికార్డు నెలకొల్పనున్నారు.
Similar News
News January 3, 2025
ఇవాళ అకౌంట్లోకి డబ్బులు: ప్రభుత్వం
TG: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవాళ పూర్తి స్థాయిలో వేతనాలు జమ అవుతాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. 1వ తేదీన సాంకేతిక కారణాలతో జీతాలు జమ కాలేదని చెప్పింది. సమస్యలను పరిష్కరించి నిన్నటి నుంచి జమ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది. పలువురి ఖాతాల్లో గురువారం రాత్రి జమ కాగా, మిగతా వారికి ఇవాళ డబ్బులు పడనున్నాయి. కాగా జనవరి 1న సెలవు కావడంతో జీతాలు జమ కాలేదనే ప్రచారం జరిగింది.
News January 3, 2025
చర్లపల్లి రైల్వే టెర్మినల్ 6న ప్రారంభం
TG: చర్లపల్లిలో రూ.430 కోట్లతో నిర్మించిన రైల్వే టెర్మినల్ ఈ నెల 6న ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ వర్చువల్‌గా ఈ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. గత నెల 28నే ఇది ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ మాజీ పీఎం మన్మోహన్ మృతి కారణంగా వాయిదా పడింది. సికింద్రాబాద్ స్టేషన్‌పై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించారు.
News January 3, 2025
డబుల్ డెక్కర్‌గా విజయవాడ, వైజాగ్ మెట్రోలు
AP: విజయవాడ, వైజాగ్‌లో మెట్రో ప్రాజెక్టులకు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌ను రూపొందించాలని సర్కారు భావిస్తోంది. దీనికి సంబంధించిన డిజైన్లను సీఎం చంద్రబాబు తాజాగా ఆమోదించారు. డబుల్ డెక్కర్ ప్లాన్‌లో పైన మెట్రో ట్రాక్, కింద వాహనాలకు ఫ్లై ఓవర్ ఉంటుంది. వైజాగ్‌లో మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు, గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వరకూ, విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకూ డబుల్ డెక్కర్ ఉంటుంది.