News June 4, 2024
9వ రౌండ్: చీపురుపల్లిలో వెనుకబడ్డ బొత్స

9వ రౌండ్ పూర్తయ్యేసరికి చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ మరింత వెనుకబడ్డారు. ఇక్కడ టీడీపీ నుంచి కళా వెంకట్రావుకి 39,328 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణకి 35,051 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన 4,277 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.
Similar News
News November 12, 2025
VZM: ‘రుణాల రికవరీ వందశాతం ఉండాలి’

రుణాల రికవరీ వందశాతం ఉండాలని DRDA పీడీ శ్రీనివాస్ పాణి ఆదేశించారు. స్థానిక DRDA కార్యాలయంలో ‘మన డబ్బులు.. మన లెక్కలు’ కార్యక్రమంపై మంగళవారం సమావేశం నిర్వహించారు. రుణాల లక్ష్యాన్ని సిబ్బంది చేరుకోవాలని కోరారు. గ్రామ స్థాయి సిబ్బందితో సమన్వయం తప్పనిసరిగా ఉండాలన్నారు. మహిళల ఆర్థికాభివృద్దిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. కార్యక్రమంలో APD సావిత్రి, DPMలు చిరంజీవి, లక్ష్మీ నాయుడు పాల్గొన్నారు.
News November 12, 2025
VZM: నేడు అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నిరసన కార్యక్రమాలు

జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నేడు వైసీపీ నిరసన ర్యాలీలు చేపట్టనుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ భాగస్వామ్యానికి అప్పగించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీలు చేపడుతున్నట్లు జిల్లా పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయాల వరకు ర్యాలీలు కొనసాగనున్నాయని తెలిపింది.
News November 12, 2025
VZM: నేడు PMAY గృహ ప్రవేశాలు

విజయనగరం జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో 8,793 ఇళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం జరగనుందని హౌసింగ్ పీడీ మురళీ తెలిపారు. బొండపల్లి మండలం అంబటివలస గ్రామంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేయనున్నారు. రాజాం, నెల్లిమర్ల, బొబ్బిలి, ఎస్.కోట, చీపురుపల్లి నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా గృహప్రవేశాలు జరుగనున్నాయి.


