News June 4, 2024

BIG BREAKING: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు

image

జనసేనాని అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. పవర్ స్టార్ ఇక పిఠాపురం ఎమ్మెల్యేగా అమరావతి శాసనసభకు వెళ్లడమే మిగిలింది. తాజాగా వెల్లడైన ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై పవన్ 50 వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

Similar News

News January 3, 2025

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

image

TG: రేషన్ కార్డుదారులకు FEB లేదా మార్చి నుంచి సన్నబియ్యం ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక్కో మనిషికి 6KGలు ఇవ్వాలని, శనివారం జరిగే క్యాబినెట్ భేటీలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. కొత్త వడ్లను కొనుగోలు చేసిన ప్రభుత్వం వాటిని వెంటనే మిల్లుకు పంపిస్తే బియ్యం సరిగ్గా రావని, అందుకే 2నెలలు తర్వాత మిల్లాడించి పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

News January 3, 2025

2 వికెట్లు డౌన్.. పెవిలియన్‌కు భారత ఓపెనర్లు

image

సిడ్నీలో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు‌కు తొలి 10 ఓవర్లలోనే షాక్ తగిలింది. ఓపెనర్లలో తొలుత రాహుల్ (4), తర్వాత జైస్వాల్ (10) ఔట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(4), గిల్(3) ఉన్నారు. కోహ్లీ క్రీజులోకి రాగానే తొలి బంతి ఎడ్జ్ తీసుకొని స్లిప్‌లోకి వెళ్లింది. తొలుత అందరూ ఔట్ అని భావించినా బాల్ గ్రౌండ్‌ను తాకడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించారు. 9 ఓవర్లకు భారత స్కోర్ 22/2.

News January 3, 2025

వైజాగ్‌లో రేపు నేవీ డే విన్యాసాలు

image

AP: నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేవీ రేపు విశాఖలో విన్యాసాలు చేయనుంది. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారత నేవీ కృషికి గుర్తుగా ఏటా డిసెంబరు 4న నేవీ డేను జరుపుతున్నారు. గత నెల 4న ఒడిశాలోని పూరీలో విన్యాసాలు నిర్వహించగా ఈ ఏడాది వాటి కొనసాగింపు వేడుకలు వైజాగ్‌లో జరగనున్నాయి.