News June 4, 2024
ప.గో.లో 8 మంది కూటమి అభ్యర్థుల విజయం

ప.గో. జిల్లాలో కూటమి అభ్యర్థులు ఎవ్వరూ తగ్గట్లేదు. మొత్తం 15 సీట్లలో ఉండి, పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు, చింతలపూడి, తణుకు, నరసాపురం స్థానాల్లో పాగా వేశారు. తాజాగా తాడేపల్లి గూడెం నుంచి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ 114955 ఓట్లు సాధించి 61510 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు కైవసం చేసుకున్నారు.
Similar News
News January 16, 2026
భీమవరంలో రైల్వే ట్రాక్‌పై బాలిక మృతదేహం కలకలం

భీమవరం-ఉండి రహదారిలోని రైల్వే గేటు సమీపంలో ట్రాక్‌పై శుక్రవారం ఓ గుర్తు తెలియని బాలిక(3) మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. రైల్వే ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం.. ఏదైనా గుర్తు తెలియని రైలు ఢీకొనడం వల్లే ఆ చిన్నారి మృతి చెంది ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతి చెందిన బాలిక గురించిన వివరాలు ఎవరికైనా తెలిస్తే వెంటనే భీమవరం రైల్వే గవర్నమెంట్ పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు.
News January 14, 2026
ఖాకీపై ఖద్దరు విజయం.. జిల్లాలో పందెం హోరు!

ఉమ్మడి ప.గో. జిల్లాలో కోడిపందేలకు లైన్ క్లియర్ అయింది. పోలీసుల ఆంక్షలు అమలు కాకపోవడంతో ‘ఖాకీపై ఖద్దరు’ విజయం సాధించినట్లయ్యింది. బుధవారం నుంచి జిల్లావ్యాప్తంగా ప్రధాన బరుల వద్ద పందేలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పందెం రాయుళ్లు భారీగా తరలిరావడంతో బరుల వద్ద కోలాహలం నెలకొంది. వచ్చే మూడు రోజుల పాటు ఈ పందెం జాతర కొనసాగనుండగా.. సంప్రదాయం పేరిట జూదం జోరందుకోవడంతో పల్లెలన్నీ పందెం సెగతో ఊగిపోతున్నాయి.
News January 14, 2026
‘గూడెం’ బరిలో రూ.2 కోట్లు పైమాటే?

తాడేపల్లిగూడెం(M)లో కోడిపందేల నిర్వహణ ఉత్కంఠ రేపుతోంది. గతేడాది ఒకే బరిలో రూ.కోటికిపైగా పందెం జరగగా, ఈసారి అది రూ.2కోట్లు దాటుతుందని సమాచారం. దీంతో పందెం రాయుళ్లంతా ఈ బరిపై ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం భారీ స్థాయిలో బెట్టింగ్‌లు జరిగే అవకాశం ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పోలీసులు బరులను ధ్వంసం చేస్తున్నా, లక్షలాది రూపాయల చేతులు మారే ఈ భారీ పందెంపైనే సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.


