News June 4, 2024
జైపూర్‌లో బీజేపీ ఘన విజయం
రాజస్థాన్‌లో బీజేపీ ఖాతా తెరిచింది. జైపూర్‌లో ఆ పార్టీ అభ్యర్థి మంజు శర్మ భారీ మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ సింగ్‌పై ఆమె 3,31,767 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించినట్లు ఈసీ ప్రకటించింది.
Similar News
News January 9, 2025
ట్రూడోకు షాక్: నిజ్జర్ హత్య కేసులో నలుగురు భారతీయులకు బెయిల్
పదవి నుంచి దిగిపోతున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు మరో షాక్! ఖలిస్థానీ టెర్రరిస్టు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకేసులో అభియోగాలు మోపిన నలుగురు భారతీయులకు కెనడాలోని ఓ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణను బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టుకు బదిలీ చేసింది. అమిత్ షా, అజిత్ ధోవల్, జైశంకర్ ఈ హత్యకు ప్లాన్ చేశారంటూ ట్రూడో ప్రభుత్వం భారత వ్యతిరేక నెరేటివ్ బిల్డ్ చేసిన సంగతి తెలిసిందే.
News January 9, 2025
పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి
HYD మార్కెట్లో 3 రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు కాస్త పెరిగాయి. నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 పెరిగి రూ.79,200గా ఉంది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.350 ఎగసి రూ.7,2600కు చేరింది. అటు వెండి ధరలు 2 రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.లక్షగా ఉంది.
News January 9, 2025
మోదీ అన్నట్టే ‘ఇండీ ఘట్‌బంధన్’ కకావికలు!
ఆర్నెల్లలో ‘ఇండీ ఘట్‌బంధన్’ కకావికలం అవుతుందన్న PM మోదీ మాటలు నిజమయ్యేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులంటున్నారు. HAR, MHలో కాంగ్రెస్ ఓటములు, JK, JHAలో ప్రభావశూన్యతే ఇందుకు కారణమంటున్నారు. అదానీ అంశంలో SP, TMC మద్దతివ్వకపోవడం, DMK TNకే పరిమితం అవ్వడం, మహారాష్ట్రలో విడిపోయిన పార్టీలు ఏకమయ్యే పరిస్థితి, INDIA లోక్‌సభ వరకేనన్న RJD, ఢిల్లీ ఎన్నికల్లో INCని కాదని AAPకు మద్దతును ఉదాహరణగా చూపిస్తున్నారు.