News June 4, 2024
అప్పట్లో షైనింగ్ ఇప్పుడు 400 పార్ – అచ్చిరాలే!

బీజేపీకి కొన్ని నినాదాలు కలిసిరావడం లేదు. 2004లో వాజ్‌పేయీ ‘ఇండియా షైనింగ్’తో బరిలోకి దిగారు. సరిగ్గా 20 ఏళ్లకు నరేంద్రమోదీ ‘అబ్కీ బార్ 400 పార్’తో రంగంలోకి దూకారు. అప్పట్లో కాంగ్రెస్ సౌజన్యంతో యూపీఏ వన్ విజయదుందుభి మోగించింది. 2024లో మాత్రం ఇండియా కూటమి గట్టి పోటీనిచ్చింది. అనూహ్యంగా పుంజుకొని బీజేపీని సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటనివ్వలేదు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం NDA హ్యాట్రిక్‌కు ఢోకా లేదు.
Similar News
News November 6, 2025
ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి లాటరీ టికెట్ కొన్నాడు.. గెలవడంతో!

రాజస్థాన్‌లోని కోట్‌పూత్లీకి చెందిన కూరగాయల వ్యాపారి అమిత్ సెహ్రా ‘పంజాబ్ స్టేట్ దీపావళి బంపర్ లాటరీ- 2025’లో రూ.11 కోట్లు గెలుచుకున్నారు. లాటరీ టికెట్ కొనేందుకు డబ్బులు లేకపోవడంతో ఆయన తన ఫ్రెండ్ దగ్గర రూ.వెయ్యి అప్పుగా తీసుకున్నాడు. తాజాగా లాటరీ గెలవడంతో సెహ్రా కృతజ్ఞతగా స్నేహితుడి కుమార్తెకు రూ. కోటి బహుమతిగా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ డబ్బును ఇల్లు, పిల్లల విద్య, భవిష్యత్తు కోసం వాడతానన్నారు.
News November 6, 2025
నఖ్వీపై తాడోపేడో తేల్చుకొనే పనిలో BCCI

దుబాయ్‌లో ఈనెల 7న జరిగే ICC మీటింగ్‌లో ACC అధ్యక్షుడు నఖ్వీపై తాడోపేడో తేల్చుకోవాలని BCCI నిర్ణయించుకుంది. ఆసియాకప్ విజేత ఇండియా టీమ్‌కు ట్రోఫీ అప్పగించకపోవడంపై నిలదీయనుంది. నఖ్వీపై పలు అభియోగాలనూ సిద్ధం చేసింది. పాక్ మంత్రిగా ఉన్న ఆయన ACC పదవికి అనర్హుడని, తప్పించాలని వాదించనుంది. దీనికి AFG బోర్డూ మద్దతు తెలిపే అవకాశముంది. కాగా ఈ భేటీకి నఖ్వీ గైర్హాజరు కావచ్చని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.
News November 6, 2025
వస్తున్నా.. ఎవరు అడ్డుకుంటారో చూస్తా: బండి

TG: జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా ఇవాళ సాయంత్రం బోరబండకు వస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. ‘ఎవరు అడ్డుకుంటారో చూస్తా. కార్యకర్తలు, ప్రజలు తరలిరావాలి. సాయంత్రం BJP దమ్మేంటో చూపిద్దాం’ అని పిలుపునిచ్చారు. తన మీటింగ్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదన్న ప్రచారం నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. అయితే తాము అనుమతి రద్దు చేశామనేది తప్పుడు ప్రచారమని, తమను ఎవరూ అనుమతే కోరలేదని పోలీసులు తెలిపారు.


