News June 4, 2024
తండ్రీకుమారుల వెనుకంజ

AP: వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. గత ఎన్నికల్లో చంద్రగిరి నుంచి గెలిచిన భాస్కర్ రెడ్డి ఈసారి ఒంగోలు ఎంపీగా బరిలో నిలిచారు. అక్కడ టీడీపీ అభ్యర్థి మాగంటి శ్రీనివాసులు రెడ్డి 13,979 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇటు చంద్రగిరి స్థానంలో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్థి పులివర్తి నాని కంటే 10,579 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.
Similar News
News November 6, 2025
ములుగు జిల్లాలో 184 కొనుగోలు కేంద్రాలు

ములుగు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణకు 184 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. మహిళా సంఘాలు 59, ప్రాథమిక సహకార సంఘాలు 99, రైతు ఉత్పాదక సంస్థ 8, గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో 18 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనుగోలు చేసి, మద్దతు ధర అందించనున్నట్లు తెలిపారు.
News November 6, 2025
ధాన్యం అమ్మిన రోజే అకౌంట్లలో డబ్బులు జమ

AP: ధాన్యం అమ్మిన రైతులకు అదేరోజు వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేసేలా ఏర్పాట్లు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీని కోసం 35 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. రోజూ నాలుగుసార్లు.. అంటే మధ్యాహ్నం 12 గంటలకు, 2 గంటలకు, సాయంత్రం 4, 7 గంటలకు రైతుల ఖాతాల్లో డబ్బులు పంపించేలా ఏర్పాట్లు చేశామన్నారు. సెలవు రోజుల్లో పేమెంట్ గేట్‌వే పనిచేయదు కనుక, ఆ డబ్బులు మరుసటి రోజు జమ అవుతాయన్నారు.
News November 6, 2025
ఫిబ్రవరి 26న విజయ్-రష్మిక పెళ్లి?

విజయ్ దేవరకొండ-రష్మికల వివాహం వచ్చే ఏడాది FEB 26న(26-2-26) జరగనున్నట్లు సమాచారం. రాజస్థాన్ ఉదయ్‌పూర్ కోట వేదికగా వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా OCT 3న వీరి <<17907469>>ఎంగేజ్మెంట్<<>> పూర్తయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఇరు కుటుంబాలు స్పందించకపోయినా ఇద్దరూ చేతి వేళ్లకు రింగ్స్‌తో కనిపిస్తున్నారు. ‘గర్ల్‌ఫ్రెండ్’ ఈవెంట్, ఓ టాక్ షోలోనూ ‘నేషనల్ క్రష్’ పరోక్షంగా <<18124449>>నిశ్చితార్థంపై<<>> హింట్ ఇచ్చారు.


