News June 4, 2024
పార్వతీపురం, కురుపాం, సాలూరులో TDP విజయం

ఉమ్మడి విజయనగరం జిల్లాలో కూటమి జోరు కొనసాగుతోంది. పార్వతీపురంలో TDP అభ్యర్థి బోనెల విజయ్ చంద్ర.. YCP అభ్యర్థి అలజంగి జోగారావుపై 23,650 ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ అభ్యర్థి మోహనరావు మూడో స్థానానికి పరిమితం అయ్యారు. కురుపాంలో YCP అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణిపై TDP అభ్యర్థి తోయక జగదీశ్వరి విజయం సాధించారు. సాలూరులో YCP అభ్యర్థి రాజన్న దొరపై TDP అభ్యర్థి సంధ్యారాణి గెలుపొందారు.
Similar News
News July 6, 2025
4 బంతుల్లో 3 వికెట్లు

మేజర్ లీగ్ క్రికెట్‌లో ఆడమ్ మిల్నే అదరగొట్టారు. సియాటెల్ ఆర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి టెక్సాస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. 19వ ఓవర్‌లో తొలి 2 బంతులకు 2 వికెట్లు పడగొట్టిన అతడు 4వ బంతికి మరో వికెట్ తీసి సియాటెల్‌ను ఆలౌట్ చేశారు. దీంతో మొత్తం ఆ ఓవర్‌లో 4 బంతుల్లోనే 3 వికెట్లు పడగొట్టారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టెక్సాస్ 188 రన్స్ చేయగా ఛేజింగ్‌లో సియాటెల్ 137 పరుగులకే కుప్పకూలింది.
News July 6, 2025
‘లక్కీ భాస్కర్’కు సీక్వెల్ ఉంది: డైరెక్టర్

వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ వెంకీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ధనుష్‌తో తాను తీసిన ‘సార్’ సినిమాకు మాత్రం సీక్వెల్ లేదని తెలిపారు. గత ఏడాది OCTలో విడుదలైన ‘లక్కీ భాస్కర్’ ₹100crకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం వెంకీ తమిళ హీరో సూర్యతో ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు.
News July 6, 2025
ప్రేమజంట ఆత్మహత్య!

AP: ప్రకాశం (D) కొమరోలు(M) అక్కపల్లెలో విషాదం నెలకొంది. పెద్దలు తమ వివాహానికి నిరాకరించడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఇవాళ తెల్లవారుజామున యువతి, యువకుడు మృతదేహాలుగా చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. మృతులు నంద్యాల(D) ప్యాపిలి(M) మాధవరం వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.