News June 4, 2024
నెల్లూరులో సీన్ రివర్స్?

AP: నెల్లూరు జిల్లాలో సీన్ రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఈ జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 10 స్థానాల్లో ఆ పార్టీనే గెలిచింది. కానీ ఇప్పుడు టీడీపీ అన్ని స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఫలితాల చివరి వరకు కూడా ఇదే ట్రెండ్ కొనసాగిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే నెల్లూరు జిల్లాలో టీడీపీ చరిత్ర సృష్టించనుంది.
Similar News
News September 18, 2025
ఇచ్చోడ: పోలీసులపై దాడి.. ప్రధాన నిందితుడి అరెస్ట్

కేశవపట్నంలో ఫారెస్ట్ అధికారులు, పోలీసులపై దాడి చేసిన ప్రధాన నిందితుడు షేక్ అల్తాఫ్ అరెస్ట్ చేసినట్లు ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలిపారు. నిందితుడిని గురువారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేసే వారిపై జిల్లా పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని హెచ్చరించారు.
News September 18, 2025
అసెంబ్లీ సమావేశాలు కుదింపు

AP: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల పనిదినాలను ప్రభుత్వం 8 రోజులకు కుదించింది. ఈనెల 27 వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. తొలుత అసెంబ్లీని ఈనెల 30 వరకు నిర్వహించాలని స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో <<17749258>>నిర్ణయించిన<<>> విషయం తెలిసిందే. అటు రేపు మధ్యాహ్నం రూ.1.30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరగనుంది. సభలో ఆమోదించాల్సిన అంశాలపై చర్చించనుంది.
News September 18, 2025
OCT 1 నుంచి అమల్లోకి ఆన్‌లైన్ గేమింగ్ చట్టం: కేంద్రం

ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించిన కొత్త <<17486290>>రూల్స్<<>> అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇప్పటికే గేమింగ్ కంపెనీలు, స్టేక్ హోల్డర్స్‌తో పలుమార్లు చర్చలు జరిపామన్నారు. రూల్స్ అమల్లోకి వచ్చే ముందు గేమింగ్ ఇండస్ట్రీతో మరోసారి చర్చిస్తామన్నారు. ఆన్‌లైన్ మనీ గేమ్స్‌ను నిషేధించేందుకు కేంద్రం ఇటీవల ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.