News June 4, 2024
Troll: ముద్రగడ పద్మనాభం కాదు.. ముద్రగడ పద్మనాభ రెడ్డి

కాపు ఉద్యమ నేత ముద్రగడ <<13375442>>పద్మనాభం<<>> పేరును మార్చే నూతన నామకరణ మహోత్సవానికి కాపు యువత సిద్ధమయ్యారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఏపీలోని కిర్లంపూడిలో ఆయన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారుస్తున్నట్లు ఓ ఇన్విటేషన్ కార్డును క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆహ్వాన పత్రికను నటుడు బ్రహ్మాజీ షేర్ చేస్తూ క్యాప్షన్ ఇవ్వాలని కోరారు.
Similar News
News December 27, 2025
ఈ IT ఉద్యోగులది చెప్పుకోలేని బాధ!

30-40 ఏళ్ల వయసున్న IT ఉద్యోగులకు గడ్డుకాలం నడుస్తోంది. ఓవైపు ప్రమోషన్లు లేక మరోవైపు లేఆఫ్‌లతో ఇబ్బంది పడుతున్నారు. పెరుగుతున్న EMIలు, ఫ్యామిలీ బాధ్యతల మధ్య AI టెక్నాలజీని అందిపుచ్చుకోవడం సవాల్‌గా మారింది. Gen Z కుర్రాళ్లు తక్కువ జీతానికే AIతో స్మార్ట్‌గా పనిచేస్తుంటే సీనియర్స్ తమకు భారంగా మారారని కంపెనీలు భావిస్తున్నాయి. ఒక్కసారి జాబ్ పోతే Bounce Back అవ్వడం ఇప్పుడు అంత ఈజీ కాదు.
News December 27, 2025
న్యూఇయర్‌కి ఫ్యామిలీతో ఉంటారా.. జైల్లో ఉంటారా: సజ్జనార్

TG: జనవరి 1 వరకు స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ కొనసాగుతుందని హైదరాబాద్ CP సజ్జనార్ పేర్కొన్నారు. 2025 వార్షిక నేర నివేదిక విడుదల సందర్భంగా పౌరులను హెచ్చరించారు. ‘మద్యం తాగి పట్టుబడితే జైల్లో వేయటం ఖాయం. HYD మొత్తం ఇప్పటికే న్యూ ఇయర్ డ్రంకెన్ డ్రైవ్ నడుస్తోంది. ఈ ఏడాది నగరంలో నేరాలు 15% తగ్గాయి. పోక్సో కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. 368 కేసుల్లో రూ.6.45 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశాం’ అని తెలిపారు.
News December 27, 2025
జరీబు భూములపై పరిశీలనకు ఆదేశం

AP: రాజధాని ప్రాంతంలోని జరీబు(3 పంటలు పండేవి) భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల వర్గీకరణపై పున:పరిశీలనకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. జరీబు, నాన్ జరీబు భూములు ఇచ్చినవారికి ప్లాట్లు ఇస్తున్నామని, ఈ ప్రక్రియ 45రోజుల్లో పూర్తి చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.


