News June 4, 2024
ఎనిమిది జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వైసీపీకి భారీ షాక్ ఇస్తున్నాయి. ఏకంగా 8 జిల్లాల్లో ఆ పార్టీ ఖాతా తెరవలేదు. కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, ప.గో, ప్రకాశం జిల్లాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఒక్కరూ ఆధిక్యంలో లేరు. విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా ఈ ఎన్నికల్లో ఖాతా తెరవకపోవడం.. ఆ పార్టీపై ప్రజా వ్యతిరేకతకు అద్దం పడుతోంది.
Similar News
News January 13, 2026
షాక్స్‌గామ్ వ్యాలీపై కన్నేసిన చైనా

జమ్ము కశ్మీర్‌లోని షాక్స్‌గామ్ వ్యాలీ ప్రాంతాన్ని తమ భూభాగం అంటూ చైనా మరోసారి ప్రకటించుకుంది. ఇప్పటికే ఆ ప్రాంతం మీదుగా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. చైనా చర్యను పలుమార్లు భారత్ ఖండించింది. అయితే షాక్స్‌గామ్ ప్రాంతం తమ భూభాగమేనని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ మీడియా సమావేశంలో తెలిపారు. కాగా 1963లో పాక్ అక్రమంగా 5,180 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకు కట్టబెట్టింది.
News January 13, 2026
‘భోగి’ ఎంత శుభ దినమో తెలుసా?

భోగి నాడు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. గోదాదేవి శ్రీరంగనాథుడిలో లీనమై పరమ ‘భోగాన్ని’ పొందిన రోజు ఇదే. వామనుడి వరంతో బలిచక్రవర్తి భూలోకానికి వచ్చే సమయమిది. ఆయనకు స్వాగతం పలికేందుకే భోగి మంటలు వేస్తారు. అలాగే ఇంద్రుడి గర్వం అణిచి శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తిన పవిత్ర దినమిది. పరమశివుని వాహనమైన బసవన్న శాపవశాన రైతుల కోసం భూమికి దిగి వచ్చిన రోజూ ఇదే. ఇలా భక్తి, ప్రకృతి, పురాణాల కలయికే ఈ భోగి పండుగ.
News January 13, 2026
తొలిసారి మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ!

TG: రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఈనెల 18న మేడారం జాతర ప్రాంతంలో కేబినెట్ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆమోదం, రైతు భరోసా పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మంత్రులు, కీలక ఐఏఎస్ అధికారులు మేడారానికి రానున్నారు. మరోవైపు సంక్రాంతి తర్వాత 16 నుంచి సీఎం జిల్లాల పర్యటన ప్రారంభించనున్నట్లు సమాచారం.


