News June 4, 2024

ఉత్కంఠగా మహబూబ్‌నగర్‌లో కౌంటింగ్

image

మహబూబ్‌నగర్ లోక్‌సభ ఓట్ల కౌంటింగ్ ఉత్కంఠంగా సాగుతోంది. 17వ రౌండ్ ముగిసేవరకూ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ కేవం 3000 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. రౌండ్ రౌండ్‌కు నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న కౌంటింగ్ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. మొదటి నుంచి లీడ్‌లో కొనసాగిన డీకే అరుణ ఆధిక్యం తాజాగా తగ్గడంతో కమలం పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.

Similar News

News February 14, 2026

పాలమూరు మేయర్ పీఠం ఎవరిని వరిస్తుందో..?

image

పాలమూరు మేయర్ పీఠం దక్కించుకునేందుకు రాజకీయ చదరంగం మొదలైంది. గెలిచిన కార్పొరేటర్లు పట్టణంలో కాకుండా క్యాంపుల్లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌లో మేయర్ రేసులో పలువురు నేతలు ఉన్నప్పటికీ, ఒకరి పేరు ప్రకటిస్తే మిగిలిన వారు తిరుగుబాటు చేస్తారనే భయంతో నేతలు మౌనం వహిస్తున్నారు. క్యాంపు రాజకీయాల నడుమ గ్రూపుల తలనొప్పి అధిష్ఠానానికి సవాల్‌గా మారింది.

News February 14, 2026

MBNR: ఈనెల 18న క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్

image

పాలమూరు విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 18న అమ్నీల్ ఫార్మా, ఆర్-సొల్యూషన్స్ సంస్థలతో క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ జరగనుంది. 2025-26 బ్యాచ్ ఫార్మసీ, ఎంబీఏ, ఎం.కామ్ విద్యార్థులు అసలు సర్టిఫికెట్లు, రెజ్యూమ్‌తో ఫార్మసీ కాలేజ్ ఆడిటోరియానికి రావాలని ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డా. ఎస్.ఎన్. అర్జున్ కుమార్ తెలిపారు. QC, QA, ప్రొడక్షన్ విభాగాల్లో నియామకాలు ఉంటాయి.

News February 14, 2026

పాలమూరు: జాతీయ చీఫ్ వచ్చినా.. ప్రభావం చూపని బీజేపీ!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపించలేదు. MBNRలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు, కిషన్ రెడ్డి కూడా ప్రచారం చేసినా బీజేపీ జెండా ఎగరలేదు. ఎంపీ డీకే అరుణ సొంత నియోజకవర్గంలో 37 వార్డుల్లో కేవలం 7 మాత్రమే గెలిచాయి. దీంతో కాషాయ పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో తీవ్ర నిరాశనే మిగిల్చాయి.