News June 4, 2024
శ్రీకాకుళం టీడీపీ ఎంపీ ఆధిక్యం

శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముందంజలో దూసుకుపోతున్నారు. పార్లమెంట్ పరిధిలోని 13 రౌండ్లకు రామ్మోహన్ నాయుడుకు 4,56,076 ఓట్లు పోలవ్వగా.. ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్‌కు 2,60,369 ఓట్లు పడ్డాయి. దీంతో టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు 1,95,707 ఓట్ల మెజారిటీతో ముందుకు సాగుతున్నారు.
Similar News
News November 1, 2025
శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపుతున్న దొంగతనాలు

జిల్లాలో వరుస చోరీ ఘటనలు ప్రజలకు భయాందోళన కలిగిస్తున్నాయి. తూ.గో జిల్లా నుంచి వచ్చి ఇక్కడ చోరీలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు ఇటీవల పట్టుకున్నారు. ఈ నెల 10న నరసన్నపేటలో ట్రాన్స్‌జెండర్లు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. తాజాగా కాశీబుగ్గలో చోరీ, సారవకోట(M) బుడితిలో వృద్ధురాలి మెడలో బంగారం చోరీ చేశారు. ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులున్న AP, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నారు.
News November 1, 2025
టెక్కలిలో యువకుడిపై పొక్సో కేసు నమోదు

టెక్కలికి చెందిన ఓ యువకుడిపై శుక్రవారం పోలీసులు పొక్సో కేసు నమోదు చేశారు. టెక్కలి సీఐ విజయ్ కుమార్ వివరాల ప్రకారం.. తన ఇంటి సమీపంలోని మైనర్ బాలికను కొంతకాలంగా యువకుడు వేధిస్తున్నాడు. ఇటీవల తల్లితండ్రులు ఇంట్లో లేనప్పుడు బాలికకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
News November 1, 2025
మీ మూలధనం, మీ హక్కు వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఇన్‌ఛార్జి కలెక్టర్

భారత ప్రభుత్వం ఆర్థిక సేవలు విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్-డిసెంబర్ 2025 త్రైమాసికానికి మీ మూలధనం, మీ హక్కుఅనే ప్రత్యేక ప్రచార వాల్ పోస్టర్‌ను జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ మహమ్మద్ ఫర్మాన్ ఖాన్ ఆవిష్కరించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో DRO వెంకటేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, బీసీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గడ్డెమ్మ, లీడ్ బ్యాంకుల మేనేజర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


