News June 4, 2024

కింగ్ మేకర్లుగా ప్రాంతీయ పార్టీలు!

image

కేంద్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. సునాయాసంగా అధికారం చేపడుతుందనుకున్న BJP చెమటోడుస్తోంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కాంగ్రెస్ తారుమారు చేస్తోంది. దీంతో NDA, INDIA కూటమిలోని ప్రాంతీయ పార్టీలు కింగ్ మేకర్లుగా మారనున్నాయి. TDP చీఫ్ చంద్రబాబు, SP చీఫ్ అఖిలేశ్, TMC అధ్యక్షురాలు మమతా బెనర్జీ, JDU అధినేత నితీశ్ కుమార్, DMK చీఫ్ స్టాలిన్‌‌ తదితరుల నిర్ణయంపై NDA, INDIA భవితవ్యం ఆధారపడి ఉంది.

Similar News

News January 13, 2026

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ Y పోస్టులు

image

<>ఇండియన్ <<>>ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ Y పోస్టుల(మెడికల్ అసిస్టెంట్) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్(Bipc) విద్యార్థులు 01 JAN, 2006-01 Jan 2010 మధ్య, బీఫార్మసీ, డిప్లొమా హోల్డర్స్ JAN 1 2003- JAN 1,2006 మధ్య జన్మించి ఉండాలి. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, PFT, అడాప్టబిలిటీ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ FEB 1. వెబ్‌సైట్: iafrecruitment.edcil.co.in

News January 13, 2026

భోగి మంటలు ఎందుకు వెలిగిస్తారు?

image

దక్షిణాయనంలో సూర్యుడు దూరమవ్వడం వల్ల చలి విపరీతంగా పెరుగుతుంది. ఆ చలిని తట్టుకోవడానికి, ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతూ ఈ మంటలు వేస్తారు. ఈ మంటలు చలి నుంచి రక్షణనిస్తూ శరీరానికి వెచ్చదనం ఇస్తాయి. అలాగే గతేడాది పడిన కష్టాలు, బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేసి, రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలు ప్రసాదించమని కోరుతూ ఈ మంటలు వేస్తారు. నూతన వెలుగులతో కొత్త జీవితాన్ని ప్రారంభించడమే ఈ భోగి మంటల అసలైన ఉద్దేశం.

News January 13, 2026

‘లైట్ ట్రాప్స్’తో సుడిదోమ, పచ్చదోమ కట్టడి

image

కొన్ని రకాల పురుగులు పంటలకు రాత్రి పూట కూడా హాని చేస్తుంటాయి. ఇలాంటి కీటకాలు రాత్రివేళ లైట్ కాంతికి బాగా ఆకర్షించబడతాయి. ఇలాంటి కీటకాలను ఆకర్షించి అంతంచేసేవే ‘లైట్ ట్రాప్స్’. ముఖ్యంగా వరిలో సుడిదోమ, పచ్చదోమ నివారణకు ఈ లైట్ ట్రాప్స్ బాగా పనిచేస్తాయి. లైట్‌తో పాటు ఒక టబ్‌లో నీటిని పోసి దానిలో రసాయన మందును కలిపితే పురుగులు లైట్‌కి ఆకర్షించబడి మందు కలిపిన నీళ్లలో పడి చనిపోతాయి.