News June 4, 2024
మంత్రి దాడిశెట్టిని ఓడించిన యనమల దివ్య

AP: తునిలో టీడీపీ అభ్యర్థి యనమల దివ్య విజయం సాధించారు. మంత్రి దాడిశెట్టి రాజాపై 14,541 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆమెకు మొత్తం 95,836 ఓట్లు పోలయ్యాయి. ఇటు మంత్రి దాడిశెట్టి రాజాకు 81,295 ఓట్లు పడ్డాయి. ఈమె టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి కూతురు.
Similar News
News September 17, 2025
MIMకు భయపడి వాస్తవాలను తొక్కిపెడుతున్నారు: కిషన్ రెడ్డి

TG: మజ్లిస్ పార్టీకి వత్తాసు పలికేవారికి ప్రజలే బుద్ధి చెబుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఓట్ల కోసం చరిత్రను వక్రీకరించి విమోచన దినోత్సవానికి అనేక పేర్లు పెడుతున్నారని మండిపడ్డారు. ఎంఐఎం పార్టీకి భయపడి వాస్తవాలను తొక్కిపెడుతున్నారని ఫైరయ్యారు. మూడేళ్ల తర్వాత తాము అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలో ఘనంగా విమోచన వేడుకలు నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
News September 17, 2025
రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మిరాయ్’

తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ‘మిరాయ్’ మూవీ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. మొదటి 4 రోజుల్లో రూ.91.45 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ చిత్రంలో మంచు మనోజ్, శ్రియ కీలక పాత్రలు పోషించగా విశ్వ ప్రసాద్ నిర్మించారు.
News September 17, 2025
ఇప్పటికే అనేక రంగాల్లో GST ప్రయోజనాలు: నిర్మల

AP: 140కోట్ల మందికి వర్తించే GSTపై పెద్ద నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. GST కౌన్సిల్ నిర్ణయాలు ఈ నెల 22నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. ఇప్పటికే అనేక రంగాలు ప్రయోజనాలు పొందుతున్నాయని విశాఖలో GST సంస్కరణల సమావేశంలో తెలిపారు. ‘12శ్లాబ్‌లో ఉండే 99శాతం వస్తువులు 5% GST పరిధిలోకి తెచ్చాం. 28 శ్లాబ్‌లో ఉండే వస్తువులు దాదాపు 90శాతం 18% పరిధిలోకి వచ్చేశాయి’ అని వివరించారు.