News June 4, 2024
మాజీ సీఎం కొడుకుపై గెలిచిన కంగన

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ హిమచల్ ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై ఆమె 70వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. మండి ప్రజలు తనపై విశ్వాసం ఉంచినట్లు ఆమె పేర్కొన్నారు. మోదీ గ్యారంటీల పట్ల నమ్మకం ఉంచి వారసత్వ పాలనను తిరస్కరించారని తెలిపారు. కాగా విక్రమాదిత్య మాజీ సీఎం వీరభద్ర సింగ్ కుమారుడు కావడం గమనార్హం.
Similar News
News January 21, 2026
పురుగు మందుల కొనుగోలు- జాగ్రత్తలు

పంటకు ఆశించినది తెగులో, పురుగో గుర్తించి.. వ్యవసాయ అధికారుల సిఫార్సు మేరకు నమ్మకమైన డీలర్ల నుంచి పురుగు మందులను కొనాలి. డీలర్ నుంచి మందు వివరాల రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి. 2,3 రకాల మందులు అందుబాటులో ఉంటే విషపూరిత గుణాన్ని బట్టి తక్కువ హాని కలిగించే మందును ఎన్నుకోవాలి. ప్యాకెట్‌పై ఆ మందును ఏ పంటలో ఏ పురుగు, తెగులు కోసం సిఫార్సు చేశారో చూసి తీసుకోవాలి. ప్యాకింగ్, గడువు తేదీని తప్పక చూడాలి.
News January 21, 2026
రూ. లక్ష జీతంతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు

<
News January 21, 2026
ఉ.10 గం. వరకు పొగమంచు.. వాహనదారులు జాగ్రత్త!

AP: మరో రెండు రోజుల పాటు తెల్లవారుజాము నుంచి ఉ.10 గం. వరకు పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల విజిబిలిటీ వంద మీటర్ల కంటే తక్కువగా నమోదవుతుందని, యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితేనే బయటకు రావాలని సూచించింది. మరోవైపు కోస్తా, రాయలసీమలో చలి తీవ్రత పెరిగింది. నిన్న అరకు లోయలో 5.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.


