News June 4, 2024

బాలయ్య, పవన్‌లకు కాజల్ విషెస్

image

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీ సాధించిన సూపర్ స్టార్స్ పవన్ కళ్యాణ్, బాలకృష్ణలకు హీరోయిన్ కాజల్ అగర్వాల్ అభినందనలు తెలిపారు. ‘మీ అవిశ్రాంత ప్రయత్నం & అచంచలమైన నిబద్ధతకు ఈ ఫలితాలు సాక్ష్యం. ఈ విజయానికి మీరు అర్హులు పవన్’ అని ట్వీట్ చేశారు. ‘ఘనవిజయం సాధించిన నందమూరిబాలకృష్ణ గారికి అభినందనలు. మీ కృషి, అంకితభావం & విజన్ మీకు జనంలో ఎంతో ప్రేమను తెచ్చిపెట్టాయి’ అని శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News November 3, 2025

కోయంబత్తూర్‌లో PG విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

image

కోయంబత్తూర్(TN) ఎయిర్ పోర్టు సమీపంలో PG విద్యార్థిని గ్యాంగ్ రేప్‌కి గురైంది. నిన్న సాయంత్రం ఆమె ప్రియుడితో కలిసి బయటకు వెళ్లింది. రాత్రి 11గ.లకు ఎయిర్‌పోర్టు దగ్గర కారులో వారు ఉండగా ముగ్గురు వ్యక్తులు వచ్చి అద్దాలు పగులగొట్టారు. ప్రియుణ్ని తీవ్రంగా కొట్టారు. ఆమెను దూరంగా షెడ్లోకి లాక్కెళ్లి రేప్ చేశారు. పోలీసులు బాధితుల్ని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

News November 3, 2025

జూబ్లీహిల్స్‌కు పాక్‌కు లింక్ పెట్టడం సరికాదు: కిషన్ రెడ్డి

image

TG: రాజకీయ విమర్శలకు పరిమితులు ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌కు పాకిస్థాన్‌కు <<18176289>>లింక్<<>> పెట్టడం సరికాదన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఫ్రీ బస్సు ఒక్కటే. జూబ్లీహిల్స్‌లో BJPకి మంచి స్పందన వస్తోంది. అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం BJPకే ప్లస్. KCR రెండేళ్లుగా ఎక్కడా కనిపించలేదు. ప్రజల మధ్యకు రాని ఆయన మళ్లీ CM ఎలా అవుతారు?’ అని మీడియాతో చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు.

News November 3, 2025

మల్లె తోటల్లో ఆకులు రాల్చడం.. దేని కోసం?

image

మల్లె తోటల్లో మంచి దిగుబడి కోసం.. నవంబర్ నుంచి చెట్లకు నీరు పెట్టకుండా ఆకులు రాలేటట్లు చేయాలి. అలాగే కొందరు రైతులు మల్లె తోటల్లో గొర్రెలను మంద కడతారు. దీని వల్ల గొర్రెలు ఆకులను తింటాయి. ఫలితంగా మొక్కలకు కొత్త చిగుర్లు వస్తాయి. అలాగే గొర్రెల ఎరువు వల్ల కూడా భూసారం పెరుగుతుంది. తర్వాత కొమ్మ కత్తిరింపులు చేపట్టాలి. కొమ్మలను కత్తిరించడానికి 10 నుంచి 15 రోజుల ముందు నుంచి నీరు కట్టడం ఆపేయాలి.