News June 4, 2024
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూటమి క్లిన్ స్వీప్..?

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎన్డీఏ కూటమి హవా కొనసాగుతుంది. ఇప్పటికే గొండు శంకర్ (శ్రీకాకుళం), కూన రవికుమార్ (ఆమదాలవలస), బెందాళం అశోక్ (ఇచ్చాపురం) భారీ మెజారిటీతో గెలుపొందారు. గౌతు శిరీష (పలాస), కింజరాపు అచ్చెన్నాయుడు (టెక్కలి), బగ్గు రమణమూర్తి (నరసన్నపేట), మామిడి గోవిందరావు (పాతపట్నం), కొండ్రు మురళి (రాజాం), ఈశ్వరరావు (ఎచ్చెర్ల), జయకృష్ణ (పాలకొండ) విజయం దిశగా పయనిస్తున్నారు.
Similar News
News January 12, 2026
శ్రీకాకుళం: UTF రాష్ట్ర కార్యదర్శిగా కిషోర్ కుమార్

ఏపీ ఐక్య టీచర్ ఫెడరేషన్ (యూటీఎఫ్ )రాష్ట్ర కార్యదర్శిగా శ్రీకాకుళానికి చెందిన కిషోర్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరులో రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఈయనను ఎంపిక చేశారు. గత కొన్నేళ్లుగా కిషోర్ కుమార్ టీచర్ల సమస్యలపై పనిచేస్తున్నారు. వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ ఉపాధ్యాయ ఉద్యమానికి అంకితమై, యూటీఎఫ్ అభివృద్ధికి విశేషంగా కృషి చేయడంతో మూడోసారి ఎన్నుకున్నారు.
News January 12, 2026
EEMT–2026 రిజల్ట్స్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్‌ర్‌గా సిక్కోలు విద్యార్థి

ఎడ్యుకేషనల్ ఎపిఫనీ (Educational Epiphany) సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 27 న నిర్వహించిన EEMT–2026 మెయిన్స్ పరీక్షల ఫలితాలను ఆదివారం ఆ సంస్థ కన్వీనర్ పుట్టం రాజు శ్రీరామచంద్ర మూర్తి అధికారికంగా ప్రకటించారు. 10వ తరగతిలో టెక్కలి మండలం సీతాపురం జడ్పీ హెచ్ పాఠశాల విద్యార్థి సకలభక్తుల భరత్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచాడు. ఈ విషయాన్ని హెచ్.ఎం పద్మావతి నిన్న తెలియజేశారు. విద్యార్థిని అభినందించారు.
News January 12, 2026
SKLM: నేడు ప్రజా ఫిర్యాదులు నమోదు

నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్‌లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి సమస్యలను నేరుగా, ఆన్‌లైన్‌లోని Meekosam.ap.gov.inలో సమర్పించుకోవాలన్నారు. అర్జీలు సమర్పించిన వారు వాటి స్థితిని తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు.


