News June 4, 2024

చంద్రబాబు, పవన్‌కు నాని విషెస్

image

ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్‌కి హీరో నాని విషెస్ తెలిపారు. ‘ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ హీరో పవన్ కళ్యాణ్‌కి అభినందనలు. అవమానాలను ఎదుర్కొంటూ పోరాడి గెలిచిన తీరు ఎంతో మందికి పాఠం. మీ విజయం చూస్తుంటే గర్వంగా ఉంది సర్. మీరు మరింత ఎత్తుకు చేరుకోవాలని, మీ పనితో పలువురికి ఉదాహరణగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.

Similar News

News November 5, 2025

భారత జట్టు ప్రకటన.. పంత్ రీఎంట్రీ

image

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు BCCI జట్టును ప్రకటించింది. పంత్, అక్షర్ జట్టులోకి వచ్చారు.
✒ టెస్ట్ టీమ్: గిల్(C), పంత్ (VC), జైస్వాల్, రాహుల్, సుదర్శన్, పడిక్కల్, జురెల్, జడేజా, సుందర్, బుమ్రా, అక్షర్‌, నితీశ్, సిరాజ్, ఆకాశ్, కుల్దీప్

✒ ODI IND-A టీమ్: తిలక్‌(C), రుతురాజ్‌(VC), అభిషేక్‌, పరాగ్‌, ఇషాన్‌, బదోని, నిషాంత్‌, V నిగమ్‌, M సుతార్‌, హర్షిత్‌, అర్ష్‌దీప్‌, ప్రసిద్ధ్, ఖలీల్, ప్రభ్‌సిమ్రాన్

News November 5, 2025

GET READY: మరికాసేపట్లో..

image

మరికొన్ని నిమిషాల్లో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. సరిగ్గా సా.6.49 గంటలకు చంద్రుడు భూమికి అతి సమీపంగా వచ్చి కనువిందు చేయనున్నాడు. సాధారణ రోజులతో పోలిస్తే భూమికి దగ్గరగా చంద్రుడు రావడంతో 14% పెద్దగా, 30% అధిక కాంతితో దర్శనమిస్తాడు. దీన్ని బీవర్ సూపర్ మూన్‌గా పిలుస్తారు. ఎలాంటి పరికరాలు లేకుండా ఈ దృశ్యాన్ని వీక్షించడానికి సిద్ధంగా ఉండండి.

News November 5, 2025

ఓటేసేందుకు వెళ్తున్న బిహారీలు.. ఆగిన నిర్మాణ పనులు

image

దేశంలోని చాలా ప్రాంతాల్లో నిర్మాణం, హోటల్స్ సహా అనేక రంగాల్లో లక్షలాది మంది బిహార్ వలస కార్మికులు పనిచేస్తున్నారు. ఈనెల 6, 11 తేదీల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వారంతా స్వస్థలాలకు వెళ్తున్నారు. దీంతో ఆయా రంగాలపై ప్రభావం పడుతోంది. దాదాపు 8 లక్షల మంది బిహార్ కార్మికులు హైదరాబాద్‌లో ఉంటున్నట్లు అంచనా. వీరంతా వచ్చే వరకు 10 రోజులు పనులకు ఇబ్బంది తప్పదని నిర్మాణ పరిశ్రమ తెలిపింది.