News June 4, 2024

మంత్రి బొత్స సత్యనారాయణ ఓటమి

image

AP: ఉత్తరాంధ్రలో తిరుగులేని నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ పరాజయం పాలయ్యారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీచేసిన బొత్సపై టీడీపీ అభ్యర్థి కళా వెంకట్రావు 11,527 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కిమిడి నాగార్జునపై 26,498 ఓట్ల తేడాతో బొత్స విజయం సాధించారు. చీపురుపల్లి నుంచి 2004, 2009, 2019లో విజయం సాధించిన బొత్సకు ఈసారి ఓటమి తప్పలేదు.

Similar News

News October 6, 2024

తప్పనిసరిగా వేసుకోవాల్సిన టీకాలివే

image

టీకాలు రోగ నిరోధక శక్తిని పటిష్ఠం చేస్తాయనే విషయం అందరికీ తెలుసు. అయితే కేవలం చిన్నపిల్లలే కాదు టీనేజర్ల నుంచి వృద్ధుల వరకు తప్పనిసరిగా వేసుకోవాల్సిన టీకాలు కొన్ని ఉన్నాయి. టీడాప్, చికెన్ పాక్స్, జోస్టర్, హెపటైటిస్ బి, ఫ్లూ టీకా, నీమోకొకల్ టీకా, ఎంఎంఆర్ టీకా, హెపటైటిస్ ఏ, మెనింగోకొకల్ టీకాలు, టైఫాయిడ్ వ్యాక్సిన్, హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ టీకాలన్నీ వైద్యుల సూచనల మేరకే తీసుకోవాలి. >SHARE

News October 6, 2024

పవన్‌కి MGRపై హఠాత్తుగా ఎందుకింత ప్రేమ?: ప్రకాశ్ రాజ్

image

ఏఐఏడీఎంకే 53వ వార్షికోత్సవం సందర్భంగా ఆ పార్టీకి, పళనిస్వామికి శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌ను ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. ‘MGRపై హ‌ఠాత్తుగా ఎందుకింత‌ ప్రేమో? పైనుంచి ఆదేశాలు అందాయా?’ అని ప్రశ్నిస్తూ జస్ట్ ఆస్కింగ్ హాష్‌ట్యాగ్ ఇచ్చారు. మరి మీరెందుకు DMK యాజమాన్యాన్ని కలిశారంటూ పవన్ ఫ్యాన్స్ ఆ పోస్టు కింద కామెంట్ చేస్తున్నారు.

News October 6, 2024

రీఎంట్రీలో దుమ్మురేపిన వరుణ్ చక్రవర్తి

image

టీమ్ ఇండియా క్రికెటర్ వరుణ్ చక్రవర్తి తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నారు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20లో దాదాపు మూడేళ్ల తర్వాత ఆయన రీఎంట్రీ ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి బంగ్లా నడ్డి విరిచారు. వరుణ్ ధాటికి ఆ జట్టు మిడిలార్డర్ కుప్పకూలడంతో స్వల్ప స్కోరుకే పరిమితమైంది. కాగా వరుణ్ 2021లో దుబాయ్‌లో స్కాట్లాండ్‌పై చివరి టీ20 ఆడారు.