News June 4, 2024

వైసీపీ ఓటమికి ప్రధాన కారణాలు(3)

image

☛ రోడ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం. దాన్ని విపక్షాలు ప్రచారాస్త్రంగా మార్చుకున్నప్పటికీ ప్రభుత్వం కళ్లు తెరవకపోవడం.
☛ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినా తేలిగ్గా తీసుకోవడం.
☛ ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నా నష్టనివారణ చర్యలు తీసుకోకపోవడం.
☛ ఎన్నికలకు 4 నెలల ముందు అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు చేసిన సమ్మె ఎఫెక్ట్ ప్రభుత్వంపై పడటం.

Similar News

News December 28, 2025

తిరుపతి: ఒకే జిల్లా.. మూడు యాసలు.!

image

తిరుపతిలో R.కోడూరు విలీన ప్రతిపాదనతో స్థానికులు సంతోషంగా ఉన్నారట. కోడూరు కడపలో ఉన్నప్పటికీ ప్రజలు విద్య, వైద్యం, ఉపాధి, వాణిజ్యం కోసం తిరుపతినే ఆశ్రయిస్తుంటారు. నిజానికి 1989లోనే బాలాజీ జిల్లాను ఏర్పాటు చేసి అందులో కోడూరును కలపాలన్న డిమాండ్ ఉండేది. ఒక వేళ కోడూరును తిరుపతిలో విలీనం చేస్తే నెల్లూరు(సూళ్లూరుపేట) యాస, కడప ప్రాస, తిరుపతి తమిళ మిక్సిడ్ తెలుగు యాసలు ఒకే జిల్లాలో చూడొచ్చు. మరి మీరేమంటారు.

News December 28, 2025

ముర్ము చరిత్ర: సాగరగర్భంలో రాష్ట్రపతి ప్రయాణం

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చరిత్ర సృష్టించారు. భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలకు ప్రతీకగా నిలిచే స్వదేశీ సబ్‌మెరైన్ INS వాఘ్‌షీర్‌లో ఆమె ప్రయాణించారు. కర్ణాటకలోని కార్వార్ నావికా కేంద్రం నుంచి సముద్ర గర్భంలో సాగిన ఈ యాత్రలో సాయుధ దళాల సుప్రీం కమాండర్‌గా ఆమె పాల్గొన్నారు. అబ్దుల్ కలాం తర్వాత ఈ ఘనత సాధించిన రెండో రాష్ట్రపతిగా ముర్ము నిలిచారు.

News December 28, 2025

APPLY NOW: ICGEBలో ఉద్యోగాలు

image

ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనిటిక్ ఇంజినీరింగ్& బయో టెక్నాలజీ(<>ICGEB<<>>) 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 31 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PhD (బయాలజికల్/కెమికల్ సైన్సెస్/లైఫ్ సైన్సెస్), MSc, డిగ్రీ (బయో ఇన్ఫర్మాటిక్స్, కంప్యూటేషనల్ బయాలజీ, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.icgeb.org/