News June 4, 2024
నాలుగు లక్షలు దాటిన శ్రీభరత్ మెజార్టీ

విశాఖ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ 4 లక్షల మెజారిటీ దాటింది. ఇప్పటివరకు భరత్‌కు 7,28,914 ఓట్లు లభించాయి. బొత్స ఝాన్సీకి 3,23,932 ఓట్లు లభించాయి. దీంతో శ్రీభరత్ 4,04,982 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరొక పది ఓట్లు కలిస్తే భరత్ నాలుగు లక్షల మార్కును చేరుకుంటారు. విశాఖ లోక్‌సభ స్థానంలో సరికొత్త రికార్డు దిశగా పయనిస్తున్నారు.
Similar News
News January 15, 2026
విశాఖలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు డాగ్ స్క్వాడ్ సహాయంతో నగరంలో గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కొరియర్ కార్యాలయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ విశాఖలో నిరంతర నిఘా కొనసాగించారు. గంజాయి వంటి మత్తుపదార్థాలు రవాణా కాకుండా ప్రజల భద్రత, యువత భవిష్యత్తు, రక్షణే లక్ష్యంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
News January 15, 2026
సింహాచలంలో 18న అప్పన్న తెప్పోత్సవం

వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి తెప్పోత్సవం ఈ నెల 18న (ఆదివారం) వరాహ పుష్కరిణిలో వైభవంగా జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు కొండపై నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. అనంతరం గ్రామ తిరువీధి ఉత్సవం జరగనుంది. ఉత్సవం కారణంగా ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకే భక్తులకు స్వామివారి దర్శనం లభిస్తుందని ఆలయ అధికారులు తెలిపారు.
News January 15, 2026
గాజువాక: లారీ ఢీకొట్టి వ్యక్తి మృతి

గాజువాక వడ్లపూడి జంక్షన్ ఆటోనగర్ వెళ్లే రహదారిలో లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నిన్న రాత్రి జరిగింది. వడ్లపూడిలో నివాసం ఉంటున్న చింత సంతోష్ కుమార్ ఇంటికి వెళ్ళటానికి రోడ్డు దాటుతుండగా కూర్మన్నపాలెం నుంచి గాజువాక వైపు వేగంగా వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సంతోష్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


