News June 4, 2024
25 ఓట్ల తేడాతో మడకశిరలో గెలుపు

మడకశిర టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు విజయం సాధించారు. హోరాహోరిగా సాగిన కౌంటింగ్ ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి ఈర లకప్పపై 25 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజుకు 78347ఓట్లు, వైసీపీ అభ్యర్థి ఈర లకప్పకు 78322ఓట్లు వచ్చాయి. వైసీపీ నేతలు రీకౌంటింగ్ అడగగా ఎన్నికల అధికారులు నిరాకరించినట్లు సమాచారం. ఇంకా బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కలపాల్సి ఉంది.
Similar News
News January 18, 2026
అనంతపురం: 19న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

అనంతపురం జిల్లా ప్రజలు 1100 కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సూచించారు. ఈనెల 19న కలెక్టరేట్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్జీదారులు meekosam.ap.gov.in ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని చెప్పారు.

News January 17, 2026
అనంతపురం: భార్యను బండరాయితో మోదిన భర్త

అగ్నిసాక్షిగా మూడు ముళ్ళు వేసిన భర్త కట్టుకున్న భార్యకు కాలయముడయ్యాడు. బండరాయితో భార్య తలపై మోది హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాయదుర్గం మండలంలోని టి.వీరాపురంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. రక్తపు మడుగులో ఉన్న భార్య శివగంగమ్మను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి భర్త సుంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.