News June 4, 2024

పుంగనూరులో ఆగిన ఫలితం..!

image

పుంగనూరు ఓట్ల లెక్కింపు 19 రౌండ్లలో జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు 18 రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 94,876 ఓట్లు సాధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 6,538 ఓట్ల లీడ్‌తో ఉన్నారు. చివరి రౌండ్ ఫలితం వచ్చి దాదాపు 2 గంటలవుతున్నా.. తర్వాత అధికారులు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదట. అక్కడ ఏం జరుగుతుందో తెలియక రెండు పార్టీల నేతలు అయోమయానికి గురవుతున్నారు. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.

Similar News

News March 24, 2026

చిత్తూరు DMHOగా నాగ శశిభూషణ్ రెడ్డి

image

చిత్తూరు డీఎంహెచ్ఓగా నాగ శశిభూషణ్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఇది వరకు అనంతపురం జిల్లా డీఐవోగా పని చేశారు. ఈ జీవోలో ప్రస్తుత డీఎంహెచ్ఓ సుధారాణిని ఎక్కడకు బదిలీ చేశారు పేర్కొనలేదు.

News March 24, 2026

చిత్తూరు: కన్నతండ్రిపై కుమారుడి దాడి

image

కన్న తండ్రిపై కుమారుడు దాడి చేసిన ఘటన పుంగనూరు మండలంలో చోటుచేసుకుంది. రాంనగర్‌కు చెందిన భాస్కర్ రాజు కుమారుడు గోవర్ధన్‌కు ఏడాది క్రితం వివాహం చేశారు. దంపతుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. సామరస్యంగా ఉండాలని సూచించడంతో కుమారుడు తండ్రిని ఇంటి నుంచి గెంటేశాడు. దీనిపై మళ్లీ పంచాయతీ పెట్టి, కోడలి పట్ల అనుకూలంగా మాట్లాడటంతో గోవర్ధన్ తండ్రిపై దాడి చేశాడు. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు.

News March 24, 2026

చిత్తూరు: సమస్యలు తెలుసుకున్న కలెక్టర్

image

చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. సమస్యలపై అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడల్, డీఆర్ఓ మోహన్ కుమార్ పాల్గొన్నారు.