News June 4, 2024

విజయవాడలో దుమ్మురేపిన కూటమి

image

AP: విజయవాడ పరిధిలోని మూడు నియోజకవర్గాలను భారీ మెజార్టీలతో కూటమి కైవసం చేసుకుంది. విజయవాడ సెంట్రల్‌లో టీడీపీ అభ్యర్థి బోండా ఉమకు మొత్తం 1,27,365 ఓట్లు పోలవగా 67,599 ఓట్ల మెజార్టీ సాధించారు. ఈస్ట్‌లో గద్దె రామ్మోహన్‌కి 1,18,841 ఓట్లు పడగా 49,640 ఓట్ల మెజార్టీ దక్కింది. బెజవాడ వెస్ట్‌లో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి 46,729 ఓట్ల మెజార్టీ రాగా 104717 ఓట్లు పోలయ్యాయి.

Similar News

News January 3, 2025

ప్రేమ కోసం పాక్‌కు.. ట్విస్ట్ ఇచ్చిన యువతి..!

image

ప్రేమించిన యువతి కోసం ఓ భారత యువకుడు పాకిస్థాన్‌కు వెళ్లగా అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన బాదల్ బాబు(30)కు పాక్‌కు చెందిన సనా రాణి(21)తో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకునేందుకు బాబు అక్రమంగా పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌ చేరుకున్నాడు. కానీ అతడిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

News January 2, 2025

మంత్రుల కుంభకోణాలు బయటపెడతా: ఎమ్మెల్యే ఏలేటి

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.కోట్లల్లో భారీ కుంభకోణాలు జరిగాయని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ స్కాముల్లో పాలు పంచుకున్న మంత్రుల పేర్లను త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానని తెలిపారు. దీనిపై సీఎం రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూస్తామని అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని విమర్శించారు.

News January 2, 2025

ఈ ఏడాది ‘తల్లికి వందనం’ లేనట్లేనా?

image

AP: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఆర్థిక లోటుతో ఈ స్కీమ్‌ను ఇప్పట్లో అమలు చేయలేమని చెప్పేశారు. కాగా ఎన్నికలకు ముందు ప్రతి విద్యార్థికీ ‘తల్లికి వందనం’ వర్తింపజేస్తామని NDA కూటమి హామీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం రావడంతో 80 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని బాంబు పేల్చారు.