News June 4, 2024

ఏదైనా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం: పొంగులేటి

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చరిత్ర సృష్టించాలన్నా దాన్ని తిరగరాయాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడతూ.. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి విజయం సాధించడంతో హర్షం వ్యక్తం చేశారు. రఘురాంరెడ్డి గెలుపునకు కృషి చేసిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News October 1, 2024

KMM: దసరా పండుగకు 724 ప్రత్యేక బస్సులు

image

దసరా పండుగ సందర్భంగా TGSRTC సుమారుగా 724 బస్సులను ప్రత్యేకంగా నడపనున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ సరిరామ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం – హైదరాబాద్ మార్గంలో నాన్ స్టాప్ షటిల్ సర్వీసులు నడపబడునని తెలిపారు. ఈనెల 9 నుంచి 11 వరకు హైదరాబాద్ – ఖమ్మం 13, 14 తేదీలలో ఖమ్మం – హైదరాబాద్‌కు నిత్యం తిరిగే 154 బస్సులతో పాటు అదనంగా 100 బస్సులను నడపనున్నట్లు తెలిపారు.

News October 1, 2024

ఖమ్మం: ‘గంజాయి అమ్మిన కొన్నా కఠిన చర్యలు’

image

ఖమ్మం జిల్లాలో పట్టుబడిన 2.80కోట్ల గంజాయిని ఎక్సైజ్‌ అధికారులు దగ్ధం చేశారు. జిల్లాలోని ఆరు ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో 72 కేసుల్లో పట్టుకున్న 1120 కేజీల గంజాయిని దగ్ధం చేశారు. ఖమ్మం డిప్యూటీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. యువత గంజాయి వంటి అన్ని రకాల మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా గంజాయి అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 1, 2024

పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!

image

సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతి కావడంతో అటు మాంసాహారం, మందు బంద్ ఉండడంతో పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అని ఖమ్మం, భద్రాద్రి జిల్లావాసులు ఆలోచనలు పడ్డారు. పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని సూచిస్తున్నారు.