News June 4, 2024

175 సీట్లు గెలిస్తే ఎంత బాధ్యత ఉంటుందో.. ఇప్పుడూ అంతే ఉంది: పవన్

image

AP: ఏపీ ప్రజలు తనకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ‘మెగా డీఎస్సీ ఇప్పించే బాధ్యత నాది. సీపీఎస్ విషయంలో ఉద్యోగులకు న్యాయం చేస్తాం. ఏరు దాటాక తెప్ప తగలేసే బుద్ధి నాకు లేదు. 175 సీట్లు గెలిస్తే ఎంత బాధ్యత ఉందో ఇప్పుడూ అంతే ఉంది. మా పాలనలో శాంతి భద్రతలు చాలా బలంగా ఉంటాయి. వ్యవస్థల్లో రాజకీయ జోక్యం ఉండదు’ అని పవన్ స్పష్టం చేశారు.

Similar News

News November 30, 2024

పాక్ ఓపెనర్ భారీ శతకం.. IND టార్గెట్ ఎంతంటే?

image

U-19 ఆసియా కప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో పాకిస్థాన్ 281/7 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ షహ్‌జైద్ భారీ సెంచరీతో అదరగొట్టారు. అతడు 147 బంతుల్లో 10 సిక్సర్లు, 5 ఫోర్లతో 159 రన్స్ చేశారు. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ 60 రన్స్‌తో రాణించారు. భారత బౌలర్లలో సమర్త్ నాగరాజ్ 3, ఆయుష్ మాత్రే 2 వికెట్లు పడగొట్టారు. IND విజయానికి 282 రన్స్ అవసరం.

News November 30, 2024

పుష్ప-2 టికెట్ ధరలు భారీగా పెంపు

image

పుష్ప-2 సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ TG ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. DEC 4న రాత్రి 9.30, అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోలకు ఓకే చెప్పింది. వీటి టికెట్ ధరలను సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లో ₹800లుగా ఖరారు చేసింది. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ ₹150, మల్టీప్లెక్స్ ₹200 చొప్పున, డిసెంబర్ 9-16 వరకు సింగిల్ స్క్రీన్ ₹105, మల్టీప్లెక్స్ ₹150 చొప్పున పెంపునకు అనుమతిచ్చింది.

News November 30, 2024

DEC 3న కలవండి: కాంగ్రెస్‌కు ECI ఆహ్వానం

image

మహారాష్ట్రలో ఓటమికి EVMలను కాంగ్రెస్ నిందిస్తుండటంపై ECI స్పందించింది. డిసెంబర్ 3న తమను కలవాలని INC బృందాన్ని ఆహ్వానించింది. ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలో అన్ని పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు భాగమవుతారని తాత్కాలిక స్పందనను తెలియజేసింది. కాంగ్రెస్ వివరించే సరైన అంశాలను సమీక్షించి, రాతపూర్వకంగా జవాబిస్తామని పేర్కొంది. పోలింగ్ శాతం అప్డేషన్ ప్రాసెస్‌లో పార్టీల భాగస్వామ్యం ఉంటుందని చెప్పింది.