News June 4, 2024
జగన్ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు: పవన్
AP: ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని, కక్షసాధింపుల సమయం కాదని కార్యకర్తలకు జనసేనాని పవన్ కళ్యాణ్ సూచించారు. ‘ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు బలమైన పునాది వేసే సమయం. అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉండాల్సిన సమయం. రక్షణ లేని ఆడబిడ్డలకు రక్షణ కల్పించే సమయం. వైఎస్ జగన్ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల కోసం పనిచేయడమే నా లక్ష్యం’ అని పవన్ స్పష్టం చేశారు.
Similar News
News November 30, 2024
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. చివరికి విషాదాంతం
ఆన్‌లైన్ ప్రేమకు మరో యువతి బలైంది. విజయవాడకు చెందిన ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడింది. అతడినే పెళ్లి చేసుకోవాలనుకోగా పేరెంట్స్ నిరాకరించారు. దీంతో ఆమె ఎలుకల మందు తాగింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. తర్వాత ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోగా తిరిగి తీసుకొచ్చారు. మరోసారి వెళ్లిపోయి ఏలూరు కాలువలో దూకింది. తాజాగా ఆమె శవాన్ని పోలీసులు గుర్తించారు.
News November 30, 2024
రైతు బంధు కంటే రూ.500 బోనస్ ఎలా మేలు అవుతుంది?: హరీశ్
TG: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని చూస్తోందని హరీశ్ రావు అన్నారు. ‘రైతుబంధు కంటే సన్నాలకిచ్చే ₹500 బోనసే మేలు అని రైతులు అంటున్నట్లు మంత్రి తుమ్మల చెబుతున్నారు. 5,19,605 క్వింటాళ్ల సన్న వడ్లకు దక్కిన బోనస్ ₹26cr. అదే రైతుబంధు కింద ఏడాదికి ₹7500cr రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. మరి రైతుబంధు కంటే బోనస్ అందించడం రైతులకు మేలు ఎలా అవుతుంది?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
News November 30, 2024
ఇంద్రధనుస్సు రంగులో మొక్కజొన్నను చూశారా?
సాధారణంగా మొక్కజొన్న కంకులు పచ్చరంగులోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే, అమెరికాలో పండే హెర్లూమ్ మొక్కజొన్న ఇంద్రధనుస్సు రంగులతో ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంటుంది. దీని ఫొటోలను నెటిజన్లు ట్వీట్స్ చేస్తూ ‘ఇంత అందంగా ఉంటే ఎలా తింటాము’ అని పోస్టులు పెడుతున్నారు. దీనిని అక్కడి ప్రజలు ‘ఇండియన్ కార్న్’ అని పిలుస్తుంటారు. కార్న్ లియోన్ బర్న్స్ అనే వ్యక్తి ఈ మొక్కజొన్నను సృష్టించారు.