News June 4, 2024

CM పదవికి రాజీనామా చేసిన జగన్

image

AP: వైఎస్ జగన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. విజయవాడ రాజ్‌భవన్‌లోని గవర్నర్ నజీర్‌కు రాజీనామా లేఖను పంపారు. కాగా 175 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ.. ఇప్పటివరకు 9 సీట్లలోనే విజయం సాధించింది.

Similar News

News January 14, 2026

ఢిల్లీ కాలుష్యం.. తప్పుకున్న వరల్డ్ నం.3

image

ఢిల్లీలో కాలుష్యం ఆటలపై ప్రభావం చూపిస్తోంది. తీవ్రమైన కాలుష్యం కారణంగా ‘ఇండియా ఓపెన్’ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు వరల్డ్ నం.3, డెన్మార్క్ ప్లేయర్ ఆండర్స్ ఆంటన్సెన్ ప్రకటించారు. బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహణకు ఇది సరైన వేదిక కాదని చెప్పారు. దీంతో ఆయన బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 5వేల డాలర్ల ఫైన్ చెల్లించారు. కాగా ‘ఇండియా ఓపెన్’ నుంచి ఆండర్స్ తప్పుకోవడం ఇది వరుసగా మూడోసారి.

News January 14, 2026

వెంటనే ఇరాన్‌ను వీడండి.. భారతీయులకు ఎంబసీ సూచన

image

ఇరాన్‌లో హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న భారతీయులు వెంటనే ఆ దేశాన్ని వీడాలని ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలని, ఎంబసీతో కాంటాక్ట్‌లో ఉండాలని తెలిపింది. సాయం కోసం ఫోన్ నంబర్లను, మెయిల్‌(cons.tehran@mea.gov.in )లో సంప్రదించాలని సూచించింది. ఎంబసీతో రిజిస్టర్ కాని వారు అధికారిక <>సైట్‌లో<<>> రిజిస్టర్ కావాలని సూచించింది.

News January 14, 2026

రేవంత్‌-CBN రహస్య ఒప్పందం కుదరదు: కాకాణి

image

AP: రాయ‌ల‌సీమ‌, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల‌కు సంజీవ‌ని వంటి రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించాల్సిందేన‌ని YCP నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. TG CM రేవంత్‌తో చేసుకున్న ఒప్పందాన్నిCBN రద్దు చేసుకోవాలన్నారు. క్లోజ్డ్‌డోర్ భేటీలో జరిగిన ఈ ఒప్పందంపై రేవంత్ మాటల్ని CBN ఖండించకపోగా ఏవేవో చెబుతూ మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు.