News June 4, 2024
ఈ రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్‌స్వీప్!
లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బీజేపీ క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. మధ్యప్రదేశ్(29), ఢిల్లీ(7), ఉత్తరాఖండ్(5), హిమాచల్ ప్రదేశ్(4), అరుణాచల్ ప్రదేశ్(2), త్రిపుర(2), అండమాన్ నికోబార్(1)లో ఇప్పటికే కొన్ని స్థానాలు గెలుచుకుంది. మిగతా స్థానాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతూ క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తోంది.
Similar News
News November 30, 2024
రైతుబంధు, బోనస్.. ఏది మంచిది?
TG: రైతుబంధు, బోనస్.. ఈ రెండింట్లో ఏది మంచిదనే దానిపై చర్చ జరుగుతోంది. పంట వేయడానికి ముందు పెట్టుబడి సాయం గత ప్రభుత్వం ఏడాదికి ఎకరాకు రూ.10వేలు ఇచ్చింది. దీని ద్వారా అవసరమైన సమయానికి రైతు చేతికి డబ్బులు అందుతాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నరకం వరి క్వింటా రూ.3వేలు పలుకుతుండగా, రూ.500 బోనస్ ఇస్తోంది. ఎకరాకు 20-24 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తే అదనంగా రూ.10-12వేలు వస్తాయి.
News November 30, 2024
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 62,417 మంది భక్తులు దర్శించుకోగా 23,096 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు చేకూరింది.
News November 30, 2024
వికారాబాద్ జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్.. భూసేకరణకు నోటిఫికేషన్
TG: వికారాబాద్ జిల్లాలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దుద్యాల మండలం పోలేపల్లిలో ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం లగచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల భూమిని సేకరించనుంది. కాగా లగచర్లలో ఫార్మా విలేజ్ కోసం గతంలో ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం నిన్న రద్దు చేసింది.