News June 4, 2024

పొత్తుల చుట్టూనే రాజకీయాలు

image

లోక్‌సభ ఎన్నికల్లో ఏ జాతీయ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో పొత్తుల వైపు దృష్టి సారించాయి. ఇప్పటికే తమతో పొత్తు ఉన్న పార్టీలను కాపాడుకోవడంతో పాటు ప్రతిపక్ష పార్టీలను ఆకర్షించే ప్రయత్నాలు మొదలెట్టాయి. ఓ వైపు ఇండియా కూటమి BJD, జేడీ(యూ), టీడీపీతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ NDAలోని పార్టీలతో ఫోన్ కాల్స్ ద్వారా సంప్రదింపులు చేసి పదవులు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.

Similar News

News November 30, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 62,417 మంది భక్తులు దర్శించుకోగా 23,096 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు చేకూరింది.

News November 30, 2024

వికారాబాద్ జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్.. భూసేకరణకు నోటిఫికేషన్

image

TG: వికారాబాద్ జిల్లాలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దుద్యాల మండలం పోలేపల్లిలో ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం లగచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల భూమిని సేకరించనుంది. కాగా లగచర్లలో ఫార్మా విలేజ్ కోసం గతంలో ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం నిన్న రద్దు చేసింది.

News November 30, 2024

YS జగన్‌ ఫొటో మార్ఫింగ్.. కేసు పెడతామని TDPకి అంబటి హెచ్చరిక

image

AP: మాజీ సీఎం జగన్ ఫొటోను మార్ఫింగ్ చేసి టీడీపీ సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్టు <>చేయడంపై<<>> మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ‘ఈ విధంగా మార్ఫింగ్ చేసి మా నాయకుడిపై పోస్టులు పెడుతూ మాకు నీతులు చెప్తారు. కేసులు పెడతారు. మేం కూడా చంద్రబాబు, లోకేశ్‌ ఫొటోలను మార్ఫింగ్ చేయలేమా? ఈ అసభ్యకర పోస్టును తక్షణమే డిలీట్ చేయండి. లేదంటే చట్టపరమైన చర్యలకు వెళ్తాం జాగ్రత్త!’ అంటూ ఏపీ పోలీసులను ట్యాగ్ చేశారు.