News June 4, 2024
AP అభివృద్ధికి అంతా కలిసి పనిచేస్తాం: మోదీ

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్డీయేకు అసాధారణమైన విజయాన్ని అందించారని, వారు అందించిన ఆశీస్సులకు ధన్యవాదాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్‌తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలను ఆయన అభినందించారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని, రాబోయే కాలంలో రాష్ట్రం అభివృద్ధి చెందేలా కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు.
Similar News
News November 12, 2025
కొన్నాళ్లు వేరుకాపురం ఉండటం మంచిదే..

పెళ్లైన తర్వాత కొన్నాళ్లు వేరుకాపురం ఉండటం మంచిదే అంటున్నారు నిపుణులు. దీనివల్ల బంధం దృఢమవ్వడంతో పాటు బాధ్యతలు తెలుస్తాయంటున్నారు. అలాగే ప్రస్తుతం దంపతులిద్దరూ ఉద్యోగం చేస్తుండటంతో కలిసి గడిపే సమయం తగ్గిపోయింది. అదే విడిగా ఉంటే కాస్త సమయమైనా దొరుకుతుందంటున్నారు. అత్తమామలతో అనుబంధం దృఢమయ్యే దాకా విడిగా ఉంటూనే సందర్భం వచ్చినప్పుడు వారితో సమయం గడపాలని సూచిస్తున్నారు.
News November 12, 2025
రబీలో సాగుకు అనువైన వేరుశనగ రకాలు

నీటి వసతిని బట్టి రబీలో వేరుశనగను నవంబర్ నుంచి DEC-15 వరకు విత్తుకోవచ్చు. కోస్తా జిల్లాల్లో రైతులు ఎక్కువగా విశిష్ట TCGS 1694 రకాన్ని సాగు చేస్తున్నారు. దీని పంట కాలం 100-105 రోజులు. దిగుబడి హెక్టారుకు 25 క్వింటాళ్లు. దీనిలో నూనెశాతం 49%. ఇదే కాకుండా కదిరి-6, కదిరి-7, ధీరజ్, ధరణి, గ్రీష్మ, నిత్యహరిత మంచి దిగుబడిస్తాయి. వేరుశనగను ప్రతిసారి ఒకే రకం కాకుండా.. మార్చి నాటితే మంచి దిగుబడి పొందవచ్చు.
News November 12, 2025
MSTCలో 37 ఉద్యోగాలు

మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ (MSTC) 37మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BE/ బీటెక్, డిగ్రీ/PG, CA/CMA, MBA, MCA ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 30వరకు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం రూ.50వేల నుంచి రూ.1,60,000 చెల్లిస్తారు. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mstcindia.co.in/


