News June 4, 2024

ప్రజలను రక్షించే బాధ్యత మాపై ఉంది: లోకేశ్

image

AP: గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం నుంచి ప్రజలను రక్షించే బాధ్యత తమపై ఉందని టీడీపీ నేత లోకేశ్ స్పష్టం చేశారు. ‘గత ఐదేళ్లలో ఎన్నో హామీలు ఇచ్చాం. వాటిని అమలు చేస్తాం. యువగళం పాదయాత్ర సందర్భంగా కార్యకర్తలకు ఇచ్చిన హామీ మేరకు వారిని ఇబ్బంది పెట్టిన అధికారులు, వైసీపీ నేతలపై విచారణ కమిటీ వేస్తాం’ అని లోకేశ్ పేర్కొన్నారు.

Similar News

News November 30, 2024

రామప్ప, సోమశిలకు రూ.142 కోట్లు: కిషన్ రెడ్డి

image

TG: యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎస్ఏఎస్‌సీఐ స్కీమ్‌తో రెండింటిని డెవలప్ చేయనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కాగా ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు 23 రాష్ట్రాల్లో 40 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది.

News November 30, 2024

కోహ్లీ.. ఆ రికార్డు బ్రేక్ చేస్తాడా?

image

BGT రెండో టెస్టు జరిగే అడిలైడ్ ఓవల్ గ్రౌండ్‌లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుకు చేరువయ్యారు. ఈ మైదానంలో మరో 102 పరుగులు చేస్తే ఆయన లారా అత్యధిక పరుగుల రికార్డును అధిగమించనున్నారు. ఇప్పటివరకు కోహ్లీ ఈ గ్రౌండ్‌లో 509 పరుగులు చేశారు. 611 పరుగులతో లారా, 552 పరుగులతో వివి రిచర్డ్స్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ వేదికలో కోహ్లీ సగటు 60కి పైనే ఉంది. డిసెంబర్ 6 నుంచి రెండో టెస్టు జరగనుంది.

News November 30, 2024

పదేళ్లలో 102% పెరిగిన మెడికల్ కాలేజీలు: నడ్డా

image

దేశంలో డాక్టర్-జనాభా నిష్పత్తి WHO ప్రమాణం కన్నా మెరుగ్గా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. WHO ప్రకారం 1:1000గా ఉండగా దేశంలో ప్రతి 811 మందికి ఒక వైద్యుడు ఉన్నారని తెలిపారు. ఈ నెల వరకు మొత్తం 13,86,145 మంది వైద్యులు రాష్ట్ర, జాతీయ మెడికల్ కౌన్సిల్ వద్ద రిజిస్టర్ చేసుకున్నట్లు చెప్పారు. 2014లో 387 ప్రభుత్వం కాలేజీలు ఉంటే ఇప్పుడు 102% పెరిగి ఆ సంఖ్య 780గా ఉందన్నారు.