News June 4, 2024

బీజేపీని నిలబెట్టిన ఆ రెండు రాష్ట్రాలు!

image

నువ్వా-నేనా అన్న‌ట్టు సాగిన ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఎన్డీయే మ్యాజిక్ ఫిగ‌ర్ దాట‌డం వెనుక గుజ‌రాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాలు కీల‌క‌పాత్ర పోషించాయి. గుజ‌రాత్‌లోని 25 స్థానాల్లో, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని 29 స్థానాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయ‌డం ద్వారా సొంతంగా 238 సీట్లు సాధించ‌గ‌లిగింది. ఈ రెండు రాష్ట్రాలే ఇప్పుడు ఎన్డీయేని మ‌ళ్లీ అధికారానికి చేరువ చేశాయి. 2019 ఫ‌లితాలే ఇక్క‌డ పున‌రావృతమ‌య్యాయి.

Similar News

News January 25, 2026

ఆదివారం రోజున మాంసాహారం తింటున్నారా?

image

ఆదివారమొస్తే చాలామంది మాంసాహారం తింటుంటారు. కానీ శాస్త్రాలు అది తప్పని చెబుతున్నాయి. ఎందుకంటే ఇది సూర్యుడికి అంకితమైన రోజు. ఆయన ఆరోగ్యానికి, సాత్విక శక్తికి కారకుడు. ‘స్త్రీ తైల మధు మాంసాని రవివారే విసర్జయేత్’ అనే శ్లోకం ప్రకారం ఈరోజు మాంసం తినకూడదు. ఇది మన శరీరంలో తామస గుణాన్ని పెంచుతుంది. సూర్యుని సాత్విక శక్తిని గ్రహించకుండా అడ్డుకుంటుంది. ఆత్మశుద్ధి, దీర్ఘాయువు కోసం ఈ నియమాలు పాటించాలి.

News January 25, 2026

2028లో స్పేస్ స్టేషన్ పనులు ప్రారంభం: ISRO

image

ఇండియన్ స్పేస్ స్టేషన్ పనులు 2028లో ప్రారంభమవుతాయని ISRO ఛైర్మన్ డా.వి.నారాయణన్ వెల్లడించారు. 2035 నాటికి పూర్తవుతాయని తెలిపారు. ఇటీవల ఫెయిలైన PSLV-C62 మిషన్ ప్రభావం ‘గగన్‌యాన్’ (మానవ సహిత అంతరిక్ష యాత్ర) ప్రాజెక్టుపై ఉండదని స్పష్టం చేశారు. చంద్రుని సౌత్ పోల్‌పై స్పేస్‌క్రాఫ్ట్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసిన ఘనత మనదేనని గుర్తుచేశారు. కాగా గగన్‌యాన్ మిషన్‌ను 2026 చివర్లో/2027లో ప్రయోగించే అవకాశముంది.

News January 25, 2026

నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్‌లో పోస్టులు

image

<>CSIR-<<>>నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ 35 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ అర్హత గలవారు ముందుగా NAT పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫిబ్రవరి 4, 5తేదీల్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్, MVV, డ్రాఫ్ట్స్‌మెన్ మెకానికల్‌కు నెలకు రూ.10,560, వెల్డర్‌కు రూ.9600 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nal.res.in