News June 4, 2024
తిరుపతి MP సీటు వైసీపీదే
తిరుపతి పార్లమెంట్ కౌంటింగ్ హోరాహోరీగా జరిగింది. తొలుత వైసీపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి వెనుకబడ్డారు. తర్వాత ప్రతి రౌండ్‌లోనూ బీజేపీ వరప్రసాద్ వరప్రసాద్‌తో హోరాహోరీ తలపడ్డారు. చివరకు గురుమూర్తికి 6,32,228 ఓట్లు దక్కాయి. సమీప ప్రత్యర్థి వరప్రసాద్ రావు 6,17,659 ఓట్లు సాధించారు. ఈక్రమంలో గురుమూర్తి 14,569 ఓట్లతో గట్టెక్కారు. ఉప ఎన్నికలో ఆయన 2,30,572 ఓట్లతో గెలవడం విశేషం.
Similar News
News November 16, 2024
బి.కొత్తకోట: క్షుద్రపూజలు చేస్తున్న వైసీపీ నేతలు అరెస్ట్
తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి.కొత్తకోటలో క్షుద్ర పూజలు నిర్వహించిన ఇద్దరు వైసీపీ నాయకులను అరెస్ట్ చేసినట్లు మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. అరెస్టైన వారిలో ఒకరు మదనపల్లె చిన్నపిల్లల ఆస్పత్రి వైద్యుడు ఏ.వీ సుబ్బారెడ్డి కాగా మరొకరు కదిరికి చెందిన వజ్ర భాస్కరరెడ్డి ఉన్నారు. బి.కొత్తకోట మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఓ పురాతన ఆలయంలో పూజలు నిర్వహించగా అరెస్టుచేశామని తెలిపారు.
News November 16, 2024
తిరుపతి: 15ఏళ్ల బాలికపై అఘాయిత్యం
తిరుపతి జిల్లా BN కండ్రిగ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. SI విశ్వనాథనాయుడు వివరాల ప్రకారం.. కల్లివెట్టు గ్రామానికి చెందిన శివ(23) ఇంటికి వెళుతూ మార్గమధ్యంలో ఓ గ్రామం వద్ద ఇంటి ముందు మంచంలో నిద్రపోతున్న 15 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇది గమనించి బాలిక తల్లిదండ్రులు శివని పోలీసులకు అప్పగించారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హజరుపరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారు.
News November 16, 2024
ఆపరేషన్ నార్కోస్ ను ప్రారంభించిన తిరుపతి RPF
రైల్వే రక్షణ దళం (RPF) ఆపరేషన్ నార్కోస్ ను ప్రారంభించింది. శుక్రవారం తిరుపతి రైల్వే స్టేషన్‌లో RPF, GRP భద్రతా బలగాలు లగేజ్ కౌంటర్లు, పార్శిల్ ఆఫీస్, ప్లాట్‌ఫారమ్‌ల పై విస్తృత తనిఖీలు చేశారు. తనిఖీల సమయంలో ఆర్పీఎఫ్‌కు చెందిన ప్రత్యేక శిక్షణ పొందిన జాగిలం ప్లాట్‌ఫారంపై నిర్లక్ష్యంగా వదిలిపెట్టబడిన ట్రాలీ బ్యాగ్, కాలేజ్ బ్యాగ్‌లలో నిషేధిత గంజాయిని గుర్తించింది. దీని విలువ సుమారు రూ.3,78,100 ఉంటుంది.