News June 4, 2024

ఉమ్మడి తూ.గో జిల్లాలో అత్యధిక మెజార్టీ ఈయనదే

image

ఉమ్మడి తూ.గో జిల్లాలోని 19 నియోజకవర్గాలనూ కూటమి ఉడ్చేసింది. టీడీపీ-13, జనసేన-5, బీజేపీ-1 స్థానంలో విజయకేతనం ఎగురవేశాయి. ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక మెజార్టీ కాకినాడ రూరల్ JSP అభ్యర్థి పంతం నానాజీ సాధించారు. పిఠాపురం నుంచి బరిలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు 70,279+ ఓట్ల మెజార్టీ రాగా.. నానాజీ 72,040+ ఓట్ల మెజార్టీతో పవన్ కంటే ముందంజలో ఉండటం గమనార్హం.
NOTE: మెజార్టీ కాస్త అటూ ఇటుగా మారొచ్చు.

Similar News

News November 9, 2025

తుఫాన్ నష్టం అంచనాకు 10న కేంద్ర బృందం

image

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు ఈనెల 10, 11 తేదీల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమిబసు నేతృత్వంలోని 8 మంది సభ్యుల బృందం, నష్టం, పునరావాస చర్యలపై కేంద్రానికి నివేదిక ఇస్తుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు.

News November 8, 2025

తాళ్లపూడి: యాసిడ్ పడి ఇద్దరికి గాయాలు

image

తాళ్లపూడి మండలం పైడిమెట్టలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గోతులమయమైన రహదారిపై వెళ్తున్న యాసిడ్ ట్యాంకర్ నుంచి కుదుపులకు యాసిడ్ లీకైంది. అది ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిపై పడటంతో వారికి గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

News November 8, 2025

రేపు రాజమండ్రిలో ఉద్యోగమేళా

image

మెప్మా, నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 9న (ఆదివారం) రాజమండ్రి సుబ్రమణ్య మైదానంలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. కనక రాజు శనివారం తెలిపారు. విభిన్న రంగాలకు చెందిన 15కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని వెల్లడించారు. టెన్త్ నుంచి పీజీ, బీటెక్, నర్సింగ్ చేసిన వారు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.