News June 4, 2024

విశాఖలో 5లక్షల మెజారిటీ‌కి చేరువలో శ్రీభరత్

image

విశాఖ పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున లోక్‌సభకు పోటీ చేసిన ఎం.శ్రీభరత్ 5 లక్షల భారీ మెజారిటీకి చేరువులో ఉన్నారు. ఇప్పటివరకు ఆయన 8,93,613 ఓట్లు సాధించారు. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ 3,97,555 ఓట్లు సాధించారు. దీనితో ప్రస్తుతం భరత్ మెజారిటీ 4,96,058కి చేరింది. మరి కొద్దిసేపట్లో ఐదు లక్షల మెజారిటీని శ్రీభరత్ చేరుకోనున్నారు.

Similar News

News January 20, 2026

సీతమ్మధార తహశీల్దారు కార్యాలయ అధికారులపై చర్యలు

image

సీతమ్మధార తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై ముగ్గురు అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. 2021 జులైలో ఏసీబీ నిర్వహించిన తనిఖీల్లో మీ-సేవా దరఖాస్తులు కారణం లేకుండా తిరస్కరించినట్టు, లంచాలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెలుగుచూశాయి. అప్పట్లో విధుల్లో ఉన్న MRO జ్ఞానవేణి, డిప్యూటీ తహశీల్దార్ మొహిద్దీన్ జిలానీ, MRI రవికృష్ణలపై విచారణ చేపట్టాలని ప్రభుత్వం మెమోలు జారీచేసింది.

News January 20, 2026

బంగ్లాదేశ్ జైళ్లలో ఉన్న విజయనగరం మత్స్యకారులకు విముక్తి

image

బంగ్లాదేశ్ జైళ్లలో గత 3 నెలలుగా బందీగా ఉన్న విజయనగరం(D)కు చెందిన 9 మంది మత్స్యకారులకు త్వరలో విముక్తి లభించనుంది. విశాఖ హర్బర్ నుంచి వేటకు వెళ్లిన ఎంఎం-735 మెకనైజ్డ్ బోటు, ఇంజిన్ చెడిపోవడంతో బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి కొట్టుకుపోయింది. దీంతో ఆ దేశ కోస్ట్ గార్డ్స్, మత్స్యకారులను అరెస్టు చేసింది. ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కృషితో విడుదల సాధ్యమైంది.

News January 20, 2026

స్టార్ హోటళ్లు-రిసార్టులతో విశాఖకు కొత్త మెరుపు

image

విశాఖలో రూ.1552 కోట్లతో 10 హోటళ్లు, రిసార్టులు నిర్మాణం కానున్నాయి. ఇవి పూర్తిస్థాయిలో ప్రారంభమైతే సుమారు 1500 గదులు పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. ఐటిసీ రూ.328 కోట్ల పెట్టుబడులతో హోటల్ ప్రాజెక్టును చేపడుతోంది. అలాగే అన్నవరం బీచ్, విమానాశ్రయానికి సమీప ప్రాంతంలో Oberoi Hotels & Resorts,7-స్టార్ లగ్జరీ రిసార్ట్ & హోటల్ ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేస్తోంది. వరుణ్ గ్రూపు కూడా హోటల్ నిర్మిస్తోంది.