News June 4, 2024
భారీ మెజార్టీతో పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపు
గుంటూరు టీడీపీ ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపొందారు. ఆయన తన ప్రత్యర్థి కిలారు వెంకట రోశయ్యపై 3,44,695 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆయనకి 8,64,948 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 5,20,253 ఓట్లు వచ్చాయి. కాగా పెమ్మసాని అమెరికా నుంచి గుంటూరు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి తనదైన శైలిలో అందరినీ కలుపుకుంటూ వెళ్ళారు. గుంటూరు జిల్లాలో టీడీపీ జెండా ఎగరవేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
Similar News
News January 3, 2025
బోరుగడ్డ అనిల్ బెయిల్ ఫిటిషన్ కొట్టివేత
బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టడమే బోరుగడ్డ పనిగా పెట్టుకున్నట్లు ఉందని వ్యాఖ్యానించింది. అతణ్ని మరికొంతకాలం జైల్లోనే ఉండనీయండని ఆదేశించింది. అలాంటి వారిపై కనికరం చూపించడానికి వీల్లేదంటూ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. కాగా సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల కేసులో బోరుగడ్డ అరెస్టైన సంగతి తెలిసిందే.
News January 3, 2025
నరసరావుపేట ఈ నెల 10లోగా ఫీజు చెల్లించాలి-DEO
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం మార్చి2025 టెన్త్, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు హాజరయ్యే అభ్యర్థులు ఈనెల 10లోగా ఫీజు చెల్లించాలని పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ తెలిపారు. ఏపీ ఆన్‌లైన్‌లో గాని నేరుగా గాని చెల్లించాలన్నారు. ఆలస్యం అయితే ఈనెల 8వ తేదీలోపు రూ.25లు, 9వ తేదీలోపు రూ.50లు, 10వ తేదీలోపు తత్కాల్ రుసుంతో ఫీజు చెల్లించాలన్నారు .
News January 3, 2025
GNT: నేటి నుంచి మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో శుక్రవారం నుంచి మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రౌండ్‌లో ఏర్పాట్లను గురువారం ఎస్పీ పరిశీలించారు. 3వ తేదీన 530 మంది అభ్యర్థులకు, 4వ తేదీన 535 మంది, 6న 536 మంది అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనునట్లు తెలిపారు. 7న పురుషులకు దేహదారుఢ్య పరీక్షలు పునః ప్రారంభిస్తామన్నారు.