News June 4, 2024
ప్రజా తీర్పు-24: గెలిచినా ఓటమే, ఓడినా గెలుపే

ఈసారి దేశ ఓటర్లు ఇరుపక్షాలకు విచిత్ర తీర్పు ఇచ్చారు. వరుసగా రెండోసారి అధికారంలో ఉన్న NDA కౌంట్ 300 లోపే ఆగింది. మ్యాజిక్ ఫిగర్ 272 దాటినా, సొంతంగా 400 సీట్లు గెలుస్తామన్న BJPకి ఈ తీర్పు ఓ పాఠం. 2014, 19 ఘన విజయాలతో పోలిస్తే ఈ ఫలితం ఓ రకంగా ఓటమే. పదేళ్లుగా పరాభవం చూసిన కాంగ్రెస్ సొంతంగా 100+ MP స్థానాలు గెలిచింది. INDIA కూటమి 233 సీట్లతో అధికారానికి ఒక్క అడుగు ముందు ఆగినా నైతికంగా వారికిది విజయమే.
Similar News
News January 30, 2026
బోర్ కొడుతుందని ఖాళీ సమయంలో చదివి..!

రైలులో వెళ్లే సమయాన్ని చదివేందుకు కేటాయించి BARC శాస్త్రవేత్తగా ఎదిగిన వేలుమణి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆయన కోయంబత్తూర్ రామకృష్ణ మిషన్ విద్యాలయంలో చదువుకోగా పేదరికంతో హాస్టల్‌లో ఉండలేక రోజూ రైలులో ప్రయాణించేవారు. ఈ జర్నీలో రోజుకు 6 గంటల ఖాళీ టైమ్ దొరికేది. ఈ సమయంలో గణితం, ఫిజిక్స్ చదువుకున్నానని వేలుమణి ట్వీట్ చేశారు. ఆయన స్థాపించిన థైరోకేర్ టెక్నాలజీస్ నెట్‌వర్త్ రూ.5వేల కోట్లు.
News January 30, 2026
120 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 30, 2026
అవాంఛిత రోమాలకు ఇలా చెక్

మహిళలను ఎక్కువగా వేధించే సమస్య అవాంఛిత రోమాలు. వీటిని కొన్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. పాలలో పసుపు వేసి కలిపి ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట రాసి 20 నిమిషాల తర్వాత వేడి నీటితో కడిగేసినట్లైతే రోమాలన్నీ తొలగిపోతాయి. ఒక అరటిపండు గుజ్జు, రెండు స్పూన్ల ఓట్ మీల్ కలిపి ముఖానికి పట్టించాలి, కాసేపు మర్దనా చేసుకోవాలి. స్నానం చేసేటప్పుడు ఫేస్‌కు పసుపు రాసి కడుక్కుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది.


