News June 4, 2024
సంచలనం.. జైలు నుంచి పోటీ చేసి గెలిచాడు

‘వారిస్ పంజాబ్ దే’ అతివాద సంస్థ చీఫ్ అమృత్‌పాల్ సంచలన విజయం సాధించారు. ఖడూర్ సాహిబ్ నుంచి జైలు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థిపై 1.78 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టైన పాల్ దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. మాజీ PM ఇందిరా గాంధీ హంతకుల్లో ఒకరైన బియాంత్ సింగ్ కుమారుడు సరబ్జీత్ సింగ్ ఖస్లా(స్వతంత్ర) ఫరీద్‌కోట్‌లో 75 ఓట్ల తేడాతో గెలుపొందారు.
Similar News
News September 10, 2025
2 నెలల్లో 6 దేశాలతో ఇజ్రాయెల్ యుద్ధం

ఇజ్రాయెల్ గత 2-3 నెలల్లోనే 6 దేశాలతో యుద్ధం చేసింది. గాజా, ఇరాన్, యెమెన్, సిరియా, లెబనాన్, ఖతర్ దేశాలతో తలపడింది. హమాస్ టెర్రరిస్టుల లక్ష్యంగానే ఈ దేశాలన్నింటితో వైరం పెట్టుకుంది. దాదాపు అన్ని దేశాలపై పైచేయి సాధించింది. అమెరికా సాయంతో IDF మిస్సైల్స్, క్లస్టర్ బాంబులు, డ్రోన్లు వాడి దాడులు చేసింది. హమాస్‌ను నిర్మూలించేందుకు ఎవరితోనైనా యుద్ధం చేస్తామని నెతన్యాహు ఇప్పటికే ప్రకటించారు.
News September 10, 2025
ఈ వంట ఆడవారికి ప్రత్యేకం..

తమిళనాడులోని తిరునల్వేలిలో ఉళుందాన్కలి వంటకాన్ని స్త్రీలకోసం ప్రత్యేకంగా చేస్తారు. ఇది అమ్మాయిల ఎముకలను బలోపేతం చేసి హార్మోన్ల అసమతుల్యతను నివారిస్తుందని నమ్ముతారు. కప్పు మినప్పప్పు, బియ్యం కలిపి వేయించి, పిండి చేస్తారు. ఈ మిశ్రమానికి బెల్లం, నీరు చేర్చి ఉడికిస్తారు. తర్వాత నెయ్యి వేసి, పైకి తేలే వరకూ కలిపితే సరిపోతుంది. దీన్ని జాగ్రత్త చేస్తే నెల నుంచి రెండు నెలల వరకూ నిల్వ ఉంటుంది.
News September 10, 2025
అమ్మాయిలకి ఈ టెస్టులు చేయించండి..

ఆడపిల్లలున్న తల్లిదండ్రులు వారు రజస్వల అయినప్పటి నుంచి వారికి కొన్ని ఆరోగ్య పరీక్షలు కచ్చితంగా చేయించాలంటున్నారు నిపుణులు. రక్తహీనత సమస్యను గుర్తించడానికి కంప్లీట్ బ్లడ్ కౌంట్(సీబీసీ) పరీక్ష, హార్మోన్ల అసమతుల్యతను గుర్తించడానికి థైరాయిడ్, హార్మోన్ల పరీక్షలు, విటమిన్‌ప్రొఫైల్ టెస్ట్, ఏవైనా మూత్ర సంబంధిత సమస్యలుంటే మూత్ర పరీక్ష చేయించాలి. వీటివల్ల ఏవైనా సమస్యలుంటే ముందుగానే గుర్తించే వీలుంటుంది.